Home » వామ్మో.. స‌లేశ్వ‌రం జాత‌ర‌కు వెళ్లే వాహ‌నాల‌కు టోల్ ఛార్జీ ఎంతో తెలుసా..?

వామ్మో.. స‌లేశ్వ‌రం జాత‌ర‌కు వెళ్లే వాహ‌నాల‌కు టోల్ ఛార్జీ ఎంతో తెలుసా..?

by Anji
Ad

మామూలుగా గుడి అంటే నిత్యం పూజ‌లు, పుర‌స్కారాలు, నైవేద్యాలు ఇవ‌న్నీ ప్ర‌తి గుడిలో జ‌రుగుతుంటాయి. కానీ ఓ దేవాల‌యంలో సంవ‌త్స‌రంలో ఒకేసారి మూడు రోజులు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. కేవ‌లం ఆరోజుల్లోనే పూజ‌లు చేసి గుడిని మూసేస్తారు. మ‌ళ్లీ తెర‌వాలంటే ఏడాది త‌రువాతనే. ఎందుకంటే.. ఆ గుడి వ‌ద్ద‌కు వెళ్ల‌డం అంత ఆషామాషీ కాదు. అక్క‌డికి వెళ్లాలంటే పెద్ద సాహ‌స‌మే చేయాలి. అది మ‌రెక్క‌డో కాదండి శ్రీ‌శైలం స‌మీపంలోనే ఉన్న‌టువంటి స‌లేశ్వ‌రం.


స‌లేశ్వ‌రంలో ప్ర‌తీ సంవ‌త్స‌రానికి ఒక‌సారి జాత‌ర జ‌రుగుతుంది. ఉగాది వెళ్లిన త‌రువాత వ‌చ్చే తొలి పౌర్ణ‌మికి ప్రారంభం అవుతుంది. శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రానికి కేవ‌లం 40 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్న‌ది.  త‌రువాత 5 కిలోమీట‌ర్ల కాలిన‌డ‌క త‌ప్ప‌దు. ఇదంత ఒక ఎత్తు అయితే వాహ‌న‌దారులు మ‌రొక ఎత్తు వేస్తున్నారు. స‌లేశ్వ‌రం జాత‌ర‌కు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి వ‌స్తుంటారు. నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా అమ్రాబాద్ మండ‌లం మ‌న్న‌నూర్ చెక్ పోస్ట్ వ‌ద్ద‌.. ఆంధ్ర ప్రాంతం నుంచి వ‌చ్చే భ‌క్తులు దోమ‌ల‌పెంట చెక్‌పోస్ట్ వ‌ద్ద టోల్‌గేట్ రుసుము వ‌సూలు చేసే విధంగా అట‌వీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Advertisement

స‌లేశ్వ‌రం జాత‌ర‌ను అదునుగా భావించి ఇష్టానుసారంగా ధ‌ర‌ల‌ను పెంచుతున్నారు. ఓ వైపు వాహ‌న‌దారులు ధ‌ర‌ల‌ను పెంచుతుండ‌గా.. మ‌రొక వైపు టోల్ గేట్ల వ‌ద్ద విచ్చ‌ల‌విడిగా రెచ్చిపోతున్నారు.  ఓవైపు పెట్రోల్‌,డిజీల్ ధ‌ర‌లు పెరిగి ప్ర‌జ‌ల న‌డ్డీ విరుస్తుంటే.. మ‌రొక వైపు టోల్ గేట్ల అధిక రుసుము వ‌సూలు చేసి ప్ర‌యాణానికి ఆటంకం క‌లిగిస్తున్నార‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. కారు, జీపు లాంటి వాహ‌నాల‌కు రూ.1000, ట్రాక్ట‌ర్‌, ఆటో 500, లారీ, బ‌స్సు, డీసీఎం రూ.1000, ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు రూ.100 టోల్‌గేట్ ఫీజును వసూలు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం నుంచి వేలాది మంది ప్ర‌జ‌లు కార్లు, డీసీఎంలు, ఇలా ప‌లు వాహ‌నాలు అద్దెకు మాట్లాడుకుని స‌లేశ్వ‌రం జాత‌రను వీక్షించేందుకు వ‌స్తుంటారు. తొలుత అక్క‌డ మాట్లాడుకున్న ధ‌ర ఒక‌టి అయితే మ‌రొక వైపు టోల్ గేట్ ద‌గ్గ‌రికి చేరుకోగానే టోల్‌గేట్ వ‌ద్ద రూ.1000 వ‌సూలు చేస్తున్నారు. అద‌నంగా మ‌రొక రూ.1000 ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రూ సొంత వాహ‌నదారులు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సలేశ్వ‌రం జాత‌ర‌కు విచ్చేయుచున్న భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి అని.. రోడ్డుపై అక్క‌డ‌క్క‌డ టోల్ గేట్ రుసుము ఇంత అని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల మ‌ధ్య వాహ‌నాల‌ను అనుమ‌తించ‌బ‌డుతుంద‌ని అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫీల్డ్ డైరెక్ట‌ర్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఇది కూడా చదవండి:

  1. ఊరంతా ఫ్లెక్సీలు, అధికారుల ఫోన్ నెంబర్లు.. ఆ ఊరికి వెళ్లాలంటే వణుకుతున్న అధికారులు.. ఎక్కడది..!
  2. ఈ త‌ప్పులు చేయ‌కుంటే కేజీఎఫ్-2 మ‌రింత‌ పెద్ద హిట్ అయ్యేదా..?
  3. మళ్లీ బస్ చార్జీల పెంపు.. ఎంత అంటే..!
Visitors Are Also Reading