Home » విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఆలస్యం లేకుండా..!

విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఆలస్యం లేకుండా..!

by Anji
Ad

సాధారణంగా భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు కొంతమంది దంపతులు విడాకుల కోసం కూడా అప్లై చేసుకుంటారు. భారతదేశంలో ఇదివరకు 6 నెలలు ఆగాలి అనే రూలు ఉండేది. కానీ ఇకనుంచి ఆ రూల్ అవసరం లేదని.. అడిగిన వెంటనే విడాకులు ఇచ్చేయవచ్చని  సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కలిసే అవకాశం ఏమాత్రం లేదని భావించే వివాహాల విషయంలో మాత్రమే ఆ వివాహాలను వెంటనే రద్దు చేయవచ్చని ఇవాళ సుప్రీంకోర్టు కీలకతీర్పు వెల్లడించింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఆరు నెలలు తప్పనిసరి నిరీక్షణ అవసరం లేదని పరిస్థితులను బట్టి ఆ కాలాన్ని రద్దు కూడా చేయవచ్చని తెలిపింది. విడాకులు కోరిన వెంటనే ఇచ్చేయవచ్చు అనేదే దాని అర్థం. 

Also Read :  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

Advertisement

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన 5గురు సభ్యుల బెంచ్ ఈ చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్‌లో సుప్రీంకోర్టుకు లభించే పవర్స్‌ని ఉపయోగించుకొని బెంచ్ ఈ ఆర్డర్ ఇచ్చింది.ఇక ఈ  6 నెలల గడువు ఇన్ని రోజుల పాటు ఎందుకు ఉంది? అనేది ఇప్పుడు కీలక అంశం. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B కింద ఈ 6 నెలల తప్పనిసరి గడువు రూల్ ఉంది. సాధారణంగా విడాకులు తీసుకోవాలి అనుకునేవారు.. ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వారు కోరారు కదా అని ఫ్యామిలీ కోర్టు… వెంటనే విడాకులను ఇచ్చేస్తే… ఆ తర్వాత వారు వెనక్కి తగ్గి, తిరిగి కలుద్దామనుకుంటే.. బోలెడన్ని తలనొప్పులు ఉంటాయి. 

Advertisement

Also Read :  పైసల కోసం దిగజారిన రాశి కన్నా.. ఆ హీరోతో బెడ్ రూమ్ సీన్లకు…?

Manam News

అలా కాకుండా.. ఓ 6 నెలల సమయం పెడితే.. ఈ కాలంలో వారిలో మార్పు సంభవించి తిరిగి కలిసిపోయి.. విడాకుల పిటిషన్ రద్దు చేసుకునే అవకాముంటుందనే ఉద్దేశంతో ఈ 6 నెలల సమయం పెట్టారు. అయితే చాలా కేసుల్లో ఇది పనిచేయడం లేదు. 6 నెలల తర్వాత కూడా దంపతులు… విడిపోతామనే అంటున్నారు. అనవసరంగా తమసమ సమయం వేస్ట్ అవుతుందని  కొంతమంది ఫీల్ అవుతున్నారు. అలాంటి వారికి సుప్రీంకోర్టు ఆదేశం అనుకూలమైనదే. సుప్రీంకోర్టు ఆదేశంలో ఓ అంశాన్ని మనం అస్సలు  మర్చిపోకూడదు. దంపతులు ఇక కలవరు అని భావించినప్పుడు మాత్రమే వెంటనే విడాకులు ఇవ్వవచ్చు.  కలిసే అవకాశం ఉంది అని భావిస్తే మాత్రం  విడాకులను కొంతకాలం వాయిదా వేసే ఛాన్స్ ఉంటుంది. 

Also Read :   మహిళల బ్లౌజులపై సింగర్ చిన్మయి వివాదాస్పద వాక్యాలు

Visitors Are Also Reading