Home » కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల వాయిదా.. మళ్లీ అప్పుడేనా..?

కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల వాయిదా.. మళ్లీ అప్పుడేనా..?

by Anji
Ad

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె  ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ మూవీ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తోంది కంగనా రనౌత్.  ఈ చిత్రం నుంచి విడుదలైన కంగనా ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలోని మిగిలిన పాత్రల ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఇవి ఎమర్జెన్సీ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Advertisement

అయితే ఇప్పుడు కంగనా అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఎమర్జెన్సీ విడుదల తేదీ వాయిదా పడింది. ఈ విషయాన్ని కంగనా తన సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కంగనా రనౌత్ ట్వీట్ చేస్తూ.. సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకున్నారు. ఎమర్జెన్సీ విడుదల తేదీని మార్చడానికి గల కారణాన్ని కూడా ఈ నటి అందరితో పంచుకుంది. ‘డియర్‌ ఫ్రెండ్స్‌ ఎమర్జెన్సీ సినిమా గురించి ఒక ముఖ్యమైన ప్రకటనను మీ అందరితో పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చాను. ఎమర్జెన్సీ సినిమా  షూటింగ్‌ సమయంలో ఓ నటిగా తానెంతో నేర్చుకున్నాను. ఆర్థికంగా కూడా ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకున్నాను. ఎమర్జెన్సీ అనేది నాకు సినిమా మాత్రమే కాదు.. నా విలువలకు, పాత్రకు పరీక్ష. ఈ మూవీ టీజ‌ర్‌కి వ‌చ్చిన రెస్పాన్స్‌, ఇత‌ర సంగ‌తులు టీమ్ మొత్తానికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి.

Advertisement

ఇందుకు మీకు కృతజ్ఞతలు. అయితే నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎమర్జెన్సీ విడుదల తేదీ గురించి అడుగుతున్నారు. మేము ఇంతకు ముందు ఎమర్జెన్సీ విడుదల తేదీని నవంబర్ 24, 2023గా ప్రకటించాం. అయితే నేను నటించిన సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 2024 చివరి వరకు నా మూవీస్‌ వరుసగా విడుదలవుతాయి. అందుకే ఎమర్జెన్సీ సినిమాను కూడా 2024కు వాయిదా వేస్తున్నాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ అందరూ ఇందుకు సహకరించాలని కోరుకుంటున్నా. మీ ప్రేమాభిమానాలు మాపై ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేసింది కంగనా రనౌత్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వాట్ ది ఫిష్ నుంచి వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్..!

టైగర్ 3 ట్రైలర్ వచ్చేసింది.. దేశం కోసం దివాళికి..!

Visitors Are Also Reading