Home » టైగర్ 3 ట్రైలర్ వచ్చేసింది.. దేశం కోసం దివాళికి..!

టైగర్ 3 ట్రైలర్ వచ్చేసింది.. దేశం కోసం దివాళికి..!

by Anji
Ad

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఏక్ తా టైగర్ సినిమా గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆరు సంవత్సరాల కిందట వచ్చిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ సినీ కెరీర్ లో ఓ బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ చిత్రంలో సల్మాన్ ఓ ఇండియన్ రా ఏజెంట్ నటించిన విషయం తెలిసినదే. దీనికి సీక్వెల్ గా వచ్చిన టైగర్ జిందా హై కూడా ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టైగర్ సిరీస్ నుంచి సినిమా వచ్చేస్తుంది. ఫస్ట్ రెండు పార్ట్స్ లో ఉన్న సల్మాన్ ఖానే మూడ పార్ట్ లో కూడా నటించడం జరిగింది. 

Advertisement

టైగర్ 3 పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఈ మూడో పార్ట్ లో టైగర్ పై అనుకోకుండా దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. దానికి కారణం ఎవరు..? ఎందుకు తనని టార్గెట్ చేశారు. తన దేశానికి సమస్య వచ్చినప్పుడు టైగర్ తిరిగి ఎలా వచ్చాడు..? దేశం కోసం ఏం చేశఆడన్నదే కథగా చూపించాడు. ఇక కత్రినా కైఫ్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ నటించగా.. తన క్యారెక్టర్ కూడా టైగర్ 3లో హైలెట్ అవ్వనుంది. 

Advertisement

ఈ టైగర్ 3 బాలీవుడ్ కిస్సింగ్ స్టార్ ఇమ్రాన్ హస్మి విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమాని మనీష్ శర్మ డైరెక్ట్ చేయడం జరిగింది. ప్రీతం ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక ట్రైలర్ లో లాస్ట్ చెప్పిన టైగర్ కి శ్వాస ఉన్నంత వరకు ఓటమిని ఒప్పుకోడు అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ సినిమాలు తెలుగులో రెగ్యులర్ గా రిలీజ్ అవుతుండగా.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ టైగర్ 3 కూడా తెలుగులో విడుదల కానుంది. ఈ దీపావళి కానుకగా నవంబర్ 12న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 

Visitors Are Also Reading