Home » వాట్ ది ఫిష్ నుంచి వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్..!

వాట్ ది ఫిష్ నుంచి వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ఆయన మంచి కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకరకంగా క్రేజీ ప్రాజెక్టుగా భావిస్తున్న వాట్ ది ఫిష్ తో కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడు మనోజ్. కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.

Advertisement

వాట్ ది ఫిష్ మనం బరంపురం అనే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారి స్థాయిలో పొందుతుంది. పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాను సిక్స్ సినిమాస్ బ్యానర్ల మీద విశాల్, బెజవాడ సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు మనోజ్ ని విభిన్న గెటప్లలో ప్రజెంట్ చేస్తూ ఇది వరకే విడుదలైన ఫస్ట్ లుక్  కి   మంచి రెస్పాన్స్ లభించింది.  తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నటువంటి వెన్నెల కిషోర్ సంబంధించి ఫస్ట్ లుక్  తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో సీరియస్ లుక్ లో చేతిలో ఓ పెద్ద రంపం మిషన్ తో చాలా క్రేజీగా కనిపిస్తున్నారు వెన్నెల కిషోర్. బ్యాక్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు గాలిలో ఎగరడం ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేస్తోంది.

Advertisement

ఇక ఈ పోస్టర్ చూస్తేనే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర చాలా క్రేజీగా ఉంటుందని అర్థం అవుతోంది. ఈ సినిమా అడ్వెంచర్స్ షూటింగ్లో టొరంటో నగరము కెనడాలోని వివిధ ప్రదేశాల్లో జరిగిందని సినిమా కోసం ప్రతిభవంతులైన నటీనటులు టెక్నికల్ టీం పనిచేస్తుందని అధికారిక ప్రకటన విడుదల చేసింది చిత్ర యూనిట్. శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వివిధ భాషల్లో తెరకెక్కుతోంది ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మంచు మనోజ్ వెన్నెల కిషోర్ మినహా ఈ సినిమాలో ఇంకా నది నటులు ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు మాత్రం చిత్ర యూనిట్ ఇంకా రివిల్ చేయలేదు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 టైగర్ 3 ట్రైలర్ వచ్చేసింది.. దేశం కోసం దివాళికి..!

 శుభలగ్నం సినిమాలో భర్తని భార్య అమ్ముకునే కాన్సెప్ట్ ఏ రైటర్ చెప్పాడో తెలుసా ?

 

Visitors Are Also Reading