Telugu News » Blog » పవన్ కళ్యాణ్ అలీ కూతురు పెళ్లికి రాకపోవడానికి అసలు కారణం అదేనా ?

పవన్ కళ్యాణ్ అలీ కూతురు పెళ్లికి రాకపోవడానికి అసలు కారణం అదేనా ?

by Anji

పవర్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో దాదాపు కమెడీయన్ గా అలీనే ఎక్కువగా కనిపించే వారు. కేవలం రెండు, మూడు సినిమాల్లో తప్ప దాదాపు అన్ని సినిమాల్లో కూడా అలీ నటించాడు.  ఈ మధ్య కాలంలో అలీ, పవన్ కళ్యాణ్ మధ్య కాస్త దూరం పెరిగిందని టాక్ వినిపిస్తుంది. అందుకు ముఖ్య కారణం ఇద్దరూ వ్యతిరేక పార్టీలలో ఉండడమే. ఇటీవల పవన్ కళ్యాణ్ పై అలీ కొన్ని సున్నితమైన విమర్శలు చేశారు. మెగా అభిమానులు కూడా అలీపై గరమయ్యారు. పవన్ ఇంటికి వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలని కోరారు అలీ. 

Advertisement

అలీ కూతురు పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, నాగార్జున ఫ్యామిలీతో కలిసి వచ్చి అలీ కూతురు ఫాతిమాను ఆశీర్వదించారు. ముఖ్యంగా హీరోలు చిరంజీవి, నాగార్జున దంపతులు, గోపిచంద్, వెంకటేష్, లెెజెండరీ కమెడీయన్ బ్రహ్మానందం హాజరై సందడి చేసారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అలీకి, పవన్ కళ్యాణ్ మధ్య దూరం ఇంకా తగ్గలేదా అని పలువు రు చర్చించుకోవడం విశేషం. గతంలో అలీ కుటుంబంలో ఏ వేడుక జరిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లి సందడి చేశారు. 

Advertisement

Also Read :   డైరెక్టర్ కృష్ణవంశీని భయపెట్టిన మూవీ ” ఖడ్గం”కి 20 ఏళ్లు.. డైరెక్టర్ ఎందుకు దాక్కున్నారంటే..?

Manam News

ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ అలీ  కూతురు పెళ్లి వేడుకలో మాత్రం కనిపించలేదు.దీంతో మరోసారి అలీ, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా నియమించిన విషయం విధితమే.  అలీ కూతురు పెళ్లికి పవన్ వస్తారనే ప్రచారం జోరుగా కొనసాగింది. పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో పవన్ కళ్యాణ్ కి అలీకి మధ్య మనస్పార్థాలు చెరిగిపోయాయని వీరిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తారని ఆశించారు. కానీ అలీ కూతురు వేడుకలో  పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటున్నా.. మెగా ఫ్యామిలీకి మాత్రం అలీ చాలా దగ్గరగానే ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా తరలివచ్చి అలీ కూతురుని ఆశీర్వదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వచ్చినా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోవడం పై అలీ ఏవిదంగా స్పందిస్తారో వేచి చూడాలి. 

Also Read :  ఆలీ అల్లుడు షెహ్యాజ్ ఏం చేస్తారంటే.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!