Home » డైరెక్టర్ కృష్ణవంశీని భయపెట్టిన మూవీ ” ఖడ్గం”కి 20 ఏళ్లు.. డైరెక్టర్ ఎందుకు దాక్కున్నారంటే..?

డైరెక్టర్ కృష్ణవంశీని భయపెట్టిన మూవీ ” ఖడ్గం”కి 20 ఏళ్లు.. డైరెక్టర్ ఎందుకు దాక్కున్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర క్రియేట్ చేసిన సినిమా ఖడ్గం.. ఆగస్టు 15వ తేదీ వచ్చిందంటే టీవీలలో ఈ సినిమా తప్పనిసరిగా వేస్తుంటారు.. అలాంటి ఖడ్గం మూవీ వెనుక చాలా చరిత్ర ఉంది.. ఖడ్గం మూవీ కృష్ణవంశీ డైరెక్షన్లో, సుంకర మధు మురళి నిర్మాతగా తెరకెక్కింది.. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్ చేసి హిట్ అయింది. శ్రీకాంత్,రవితేజ, ప్రకాష్ రాజ్,సోనాలి బింద్రే, కిమ్ శర్మ,సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా లోని పాటలు కూడా అప్పట్లో సూపర్ హిట్.. అలాంటి ఖడ్గం సినిమా 2002 నవంబర్ 29 రోజున విడుదలైంది.

also read:ఈ క్యూట్ పాపని గుర్తుపట్టారా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్…!!

సరిగ్గా ఈ సినిమా రిలీజ్ అయి మంగళవారానికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఈ తరుణంలో ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీకి చంపేస్తామని చెప్పి అనేక బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి..దాంతో చాలా రోజులు కృష్ణ వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళారు.అలాగే ఈ సినిమాలో దేశభక్తి అంటే ఏమిటో,అసలు భారతీయుడు అంటే ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచిన ఈ సినిమా నరనరాల్లో దేశభక్తిని ఉప్పొంగించిన అద్భుతమైన చిత్రం.

1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలామంది చనిపోయిన టైం లో ఈ కథ రాసుకున్నారు కృష్ణవంశీ. స్టార్ హీరోల కంటే కొత్త వారితో సినిమా చేయటానికి కృష్ణవంశీ ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. టెర్రరిస్టుల బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో ఓ పోలీస్ ఆఫీసర్ ద్వారా కృష్ణవంశీ జైలుకు వెళ్లి మరీ అధ్యయనం చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. 72 రోజుల షూటింగ్లో రెండున్నర కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ మూవీకి 5 నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. అలాంటి ఈ చిత్రం ఈరోజుకి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి యాధిలో..

also read:

Visitors Are Also Reading