Home » త్రిష టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి అసలు కారణం ఇదేనా..?

త్రిష టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి అసలు కారణం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala

గత కొన్ని ఏళ్ల నుంచి సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష అంటే తెలియని వారు ఉండరు. తన కెరియర్ మధ్యలో కొన్నాళ్లు డల్ అయిపోయిన త్రిష. ఆ తర్వాత ఉపందుకుంది. సూపర్ ఫామ్ లో ఉంది. అయితే తమిళంలోనే కాదు తెలుగులో కూడా త్రిష స్టార్ హీరోలు అందరితో నటించింది. ఇంకా చెప్పాలి అంటే ఈమెకు స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టింది తెలుగు సినిమాలే. అలాంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలంటే దూరం పెడుతోంది.

దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయట. ఇప్పటికే తమిళంలో వరస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఒకటి రెండు తెలుగు ఆఫర్లు వచ్చిన అమ్మడు కాదంటుందట. రీసెంట్ గా పోనియన్ సెల్వన్ 1,2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది త్రిష. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా త్రిష గ్లామర్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

నీ మనసు నాకు తెలుసు సినిమా త్రిష ఫస్ట్ ప్రాజెక్టు సమయంలో ఎలా ఉందో ఇప్పటికి అమ్మడు అలాగే ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్రాజెక్టు చేయాల్సింది కానీ ఎందుకో ఆమె సినిమా నుంచి ఎగ్జిట్ అయింది. ఈ విధంగా ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చిన ఇంకో నాలుగు ఐదు ఏండ్లు తన క్రేజ్ కొనసాగించేలా కనిపిస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఎందుకు భయపడుతోంది ?

Visitors Are Also Reading