Home » ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఎందుకు భయపడుతోంది ?

ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఎందుకు భయపడుతోంది ?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. వర్షం సినిమాతో అధిక అభిమానులను సంపాదించుకుని..  ముఖ్యంగా ఛత్రపతి సినిమా నుంచి ఊర మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.  బాహుబలి సిరీస్ తో  ప్రభాస్ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ప్రస్తుతం ఆయన ఒక్క ప్లాప్ సినిమా మన స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమా ఆ రేంజ్లో వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ విషయాన్ని ఏ హీరో అభిమానియన ఒప్పుకోవాల్సిందే. ప్రభాస్ బాహుబలి తర్వాత గత రెండు చిత్రాలు డిజాస్టర్ టాక్  సొంతం చేసుకున్నాయి. అందులో ఒక సినిమాకి రూ.400 కోట్ల కి పైగా గ్రాస్ వస్తే.. మరో సినిమాకి 200 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు చేశాయి. డిజాస్టర్ అయిన సినిమా ఈ రేంజ్ లో వసూలు వస్తున్నాయంటే హిట్టయితే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

అలాంటి ప్రభాస్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించాలంటే అరుదైన అదృష్టం కలిగితే ఏ హీరోయిన్ మాత్రం వద్దనుకుంటుంది చెప్పండి. కానీ ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ సినిమా చేసేందుకు చాలా భయపడి పోతుందట.  అతనితో తాను సినిమా చేయనని దర్శక నిర్మాతలతో నిర్మొహమాటంగా చెప్పేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదండోయ్ కాజల్ అగర్వాల్. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్  నటిస్తోంది. ఈ సినిమా అనుకున్నప్పుడే ఈ పాత్రకి కాజల్ అగర్వాల్ అయితే సరిగ్గా సరిపోతుందని ఆమెను సంప్రదించాడంట దర్శకుడు ప్రశాంత్ నీల్. కానీ ప్రభాస్ తో తాను సినిమా చేయనంటూ కాజల్ మొహమాటం లేకుండానే చెప్పేసిందట. అంత పెద్ద క్రేజీ ప్రాజెక్టులు నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా?

Advertisement

కాజల్ అగర్వాల్ ఎందుకు వదులుకుంది కాజల్ కి ప్రభాస్ కి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అనే సందేహాలు అభిమానుల్లో ఎప్పటినుంచో ఉన్నాయి. ఇద్దరూ కలిసి గతంలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ సెట్ అయ్యాయి. మళ్లీ ఈ క్యూట్ ఫెయిర్ ని వెండితెర మీద చూసేందుకు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు కానీ అది ఎప్పటికీ సాధ్యపడేటట్టు కనిపించడం లేదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా సమయంలో ప్రభాస్ కాజల్ ఇద్దరు ప్రేమించుకున్నారని.. ఎందుకో ప్రభాస్ చివరి నిమిషంలో బ్రేకప్ చెప్పేసాడని అప్పటినుంచి కాజల్ ప్రభాస్ తో మాట్లాడడం లేదని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. ప్రతి హీరో పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేసే కాజల్ అగర్వాల్ ప్రభాస్ పుట్టినరోజుకి మాత్రం శుభాకాంక్షలు తెలియజేయకపోవడానికి కారణం అతని మీద ఆమెకున్న కోపమే అని అంటున్నారు. వీరిద్దరినీ మరోసారి వెండితెర మీద చూడాలని కోరిక ఎప్పటికీ నెరవేరదనే అంటున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష మూవీ జూన్ 16న విడుదల కాబోతోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

 కుంభంలోకి శని తిరోగమనం.. ఆ మూడు రాశుల వారి ఖజానా నిండినట్టే..!

 బస్ డ్రైవర్ కాబోతున్న బాలకృష్ణ.. అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా..!!

Tik Tok స్టార్ ప్రేమలత నెల సంపాదన ఇన్ని లక్షలా.. ఎంతో తెలిస్తే నిద్ర పట్టదు..!!

Visitors Are Also Reading