Home » హీరో అజిత్ గురించి ఆ నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. ఎందుకంటే..?

హీరో అజిత్ గురించి ఆ నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. ఎందుకంటే..?

by Anji
Ad

తమిళనాడు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆ స్టార్ హీరో గురించి ఓ నిర్మాత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఆ హీరో ఎవరు..? ఆ నిర్మాతను ఎలా మోసం చేసారు.. వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే కేవలం తమిళ సినీ ఇండస్ట్రీలో కాదు.. తెలుగు ఇండస్ట్రీలో కూడా పరిచయమున్న నటుడే. డిఫరెంట్ కథలను ఎంచుకొని సినిమాలను తీసే అజిత్ కుమార్ గురించి నిర్మాత మాణికం నారాయణన్ సంచలన కామెంట్స్ చేశారు. అజిత్ కుమార్ అందరూ అనుకునేంత మంచివాడు కాదని.. ఆయన పెద్ద చీటర్ అని నా దగ్గర డబ్బులు తీసుకొని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నారాయణన్ ఈ ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. తన తల్లిదండ్రులు సెలవుపై మలేషియాకి పంపారు అని. కొన్నేళ్ల క్రితం అజిత్ నా నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆ సమయంలో ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడని తెలిపారు.

Advertisement

ఇప్పటివరకు నాతో సినిమా చేయలేదు. కనీసం డబ్బులు అడిగినా తిరిగి ఇవ్వలేదని.. కనీసం ఆ డబ్బుల గురించి మాట్లాడటం మానేశాడు అంటూ మండిపడ్డారు. అజిత్ ప్రస్తుతం ఓ పెద్ద స్టార్ అయ్యాడని.. ఒక్కో సినిమాకు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అంత సంపాదిస్తున్నప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వవచ్చు కదా అంటూ ప్రశ్నించారు. కేవలం నేనే కాకుండా నిర్మాతలు కూడా అజిత్ తో సినిమాలు నిర్మిచడంతో భారీగా నష్టపోయామని పేర్కొన్నారు. నష్టపోయిన వారిని ఆదుకోవడానికి కనీసం ఎప్పుడు ముందుకు రాలేదని సంచలన కామెంట్స్ చేసారు. అజిత్ కి ఒకసారి రూ.6లక్షలు, మరొక సారి రూ.12లక్షలు ఇచ్చానని తెలిపారు. ప్రస్తుతం అజిత్ గురించి నిర్మాత మాణికం నారాయణన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అనుష్క సినిమా కెరీర్ లో మరిచిపోలేని పాత్రలు ఇవే !

రెండో పెళ్లి చేసుకున్నా..మొదటి భార్య బిడ్డలను కూడా ప్రేమగా చూసుకునే సెలబ్రిటీలు..!

Visitors Are Also Reading