Home » అనుష్క సినిమా కెరీర్ లో మరిచిపోలేని పాత్రలు ఇవే !

అనుష్క సినిమా కెరీర్ లో మరిచిపోలేని పాత్రలు ఇవే !

by Bunty
Ad

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. అగ్ర హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. అనుష్క తన నటన, అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలలో నటించడం కాస్త తగ్గించేసింది. అయితే అనుష్క తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించింది. అందులో కొన్ని పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉన్నాయి. ఆ పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# అరుంధతి

అనుష్క కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా అరుంధతి. ఇందులో అనుష్క జేజమ్మగా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో అనుష్క డ్యూయల్ రోల్ చేసి కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

# వేదం

Advertisement

టాప్ హీరోయిన్గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ అనుష్క వేదం సినిమాలో వేశ్యపాత్రలో అల్లు అర్జున్ సరసన నటించింది. ఈ సినిమాలో అనుష్క మనసున్న సరోజాగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

# బాహుబలి

బాహుబలి సినిమాలో దేవసేనగా అనుష్క నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో యువరాణి పాత్రలో అనుష్క నటించి తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.

# రుద్రమదేవి

ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రలో అనుష్క నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకుంది.

# భాగమతి

బాహుబలి వంటి సినిమాలతో అమాంతం తన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయినప్పటికీ… భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాని మనసుపెట్టి చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ భామ.

ఇవి కూడా చదవండి

టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

మరోసారి ఇండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ !

Visitors Are Also Reading