Home » కాళ్లు, చేతులు లేకున్నా ఈ బాలుడి టాలెంట్ కి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే..!

కాళ్లు, చేతులు లేకున్నా ఈ బాలుడి టాలెంట్ కి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే..!

by Anji

సాధార‌ణంగా ఈ భూమి పుట్టే ప్ర‌తి జీవి పుట్టుక‌తోనే టాలెంట్ ఉండ‌దు. మెల్ల‌మెల్ల‌గా టాలెంట్ అనేది వ‌స్తుంటుంది. కొన్ని జీవుల్లో మాత్ర‌మే పుట్టుక‌తోనే మేథా శ‌క్తి లేదా టాలెంట్ ఉంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మాన‌వునిలో కూడా ఇదే వ‌ర్తిస్తుంది. కొంత‌మంది పుట్టిన త‌రువాత మెల్ల‌మెల్ల‌గా త‌మ‌లో ఉన్న టాలెంట్‌ను బ‌య‌టికి తీస్తుంటారు. మ‌రికొంద‌రికి పుట్టుక‌తోనే వారి టాలెంట్ బ‌య‌ట‌ప‌డుతుంటుంది. కొంద‌ర సాధార‌ణ టాలెంట్ క‌లిగి ఉంటే మ‌రికొంద‌రూ అసాధార‌ణ టాలెంట్ క‌లిగి ఉంటారు. వారి టాలెంట్ కి ప‌దును పెడితే వారి జీవితానికి తిరుగుండ‌దు. వారి జీవితంలో ఎన్ని అవాంత‌రాలు ఎదురు వ‌చ్చిన వాటిని త‌ట్టుకుని త‌న ప్ర‌యాణం సాగిస్తుంటారు.


అన్ని అవ‌య‌వాలు ప‌ని చేసే సాధార‌ణ మాన‌వుడితో పోల్చితే వికలాంగుల జీవితం చాలా క‌ష్టం అనే చెప్పాలి. ఇటీవ‌ల వారు ఆత్మ‌స్థైర్యంతో ముందుకు కొన‌సాగుతున్నారు. దేవుడు వారికి అంగ‌వైకల్యం ఇచ్చిన‌ప్ప‌టికీ కానీ బుద్ది బలం మాత్ర‌మే తోటివారితో పోల్చితే కొద్దిగా ఎక్కువ‌గానే ఇస్తాడ‌ని కొంద‌రూ పేర్కొంటుంటారు. దివ్యాంగులు వారి వైక‌ల్యం వారికి మైన‌స్ కాకూడ‌ద‌ని చాలా ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిరంత‌రం త‌పిస్తుంటారు. అందుకోసం వారిలో దాగిఉన్న టాలెంట్ ను బ‌య‌టికి తీసి న‌లుగురికి శ‌భాష్ అనిపించుకుంటారు. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే కాళ్లు చేతులు లేని ఓ బాలుడి టాలెంట్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు.

ఖాళీ పేప‌ర్ పై ప‌ర‌మ‌శివుడి బొమ్మ‌ను నోటితో గీసి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నాడు.ఆ బొమ్మ గీస్తున్నంత సేపు అత‌ని దృష్టి అంతా డ్రాయింగ్ పైనే ఉంది. క‌నీసం ఎవ‌రి సాయం కూడా తీసుకోలేదు. సొంతంగా బొమ్మ గీసి డ్రాయింగ్ లో అత‌ని ఉన్న అసాధార‌ణ ప్ర‌తిభ‌ను బాహ్య ప్ర‌పంచానికి చూపించాడు. దీంతో అందరూ ఆ బాలుడిని మెచ్చుకుంటున్నారు. అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డేవారికి ఆయా స్థానిక ప్ర‌భుత్వాలు తోడ్పాటు అందించ‌డం వ‌ల్ల వారు జీవితంలో త‌మ గోల్ ను రీచ్ అవ్వ‌డానికి ఆస్కారం ఉంటుంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ బాలుడి అద్భుత‌మైన పేయింటింగ్‌కి సంబందించి వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆ బాలుడిని పొగుడుతున్నారు. అన్ని ఏం చేయ‌లేని చాలా మంది అంగ‌వైక‌ల్యంతో కూడా ఇంత మంచి పెయింటింగ్ వేస్తున్నావంటే చాలా గ్రేట్ అంటున్నారు.

Also Read : 

కోడి రామ‌కృష్ణ‌-బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా..?

Chanakya Niti : కాకి నుంచి ఈ నాలుగు విష‌యాల‌ను నేర్చుకుంటే మీకు జీవితంలో తిరుగుండ‌దు..!

 

Visitors Are Also Reading