Home » The Legend: ఓటిటిలోకి లెజెండ్ శరవణన్ ‘ది లెజెండ్’… ఎందులో అంటే!

The Legend: ఓటిటిలోకి లెజెండ్ శరవణన్ ‘ది లెజెండ్’… ఎందులో అంటే!

by Bunty
Ad

గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ ‘ది లెజెండ్’ అనే పాన్ ఇండియా చిత్రంతో సిని ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దీనికి జెడి జెర్రీ దర్శకుడు కాగా, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కథానాయికగా నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడమే కాదు నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూశారు.

READ ALSO : Virupaksha Teaser : “విరూపాక్ష” టీజర్ వచ్చేసింది… మరీ ఇంత సస్పెన్సా..?

Advertisement

ఇక తాజాగా ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రానికి ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.మార్చి 3వ తేదీ అంటే ఇవాల్టి నుంచే మధ్యాహ్నం 12:30 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని లెజెండ్ శరవణన్ స్వయంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే డాక్టర్ శరవనన్ వైద్య రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు చేస్తారు.

Advertisement

READ ALSO : విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్‌ చేసిన ఉమేష్ యాదవ్

తన మిత్రుడు డయాబెటిక్ కారణంగా చనిపోవడంతో ఆయన ఈ మహమ్మారికి మందు కనిపెట్టాలని నిర్ణయం తీసుకుంటాడు. డాక్టర్ శరవనన్ నిర్ణయం మెడికల్ మాఫియా ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉంటుంది. దీంతో శరవనన్ చేసే ప్రయోగం అడ్డుకునే క్రమంలో అతన్ని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా దెబ్బతీస్తారు. సర్వం కోల్పోయిన శరవనన్ మాఫీయాపై ఎలా పగ తీర్చుకున్నాడు? తన లక్ష్యం ఎలా సాధించాడు? అనేది సినిమా స్టోరీ.

READ ALSO : మోహన్ బాబు, విష్ణు లేకుండానే మంచు మనోజ్ పెళ్లి..?

Visitors Are Also Reading