Home » Virupaksha Teaser : “విరూపాక్ష” టీజర్ వచ్చేసింది… మరీ ఇంత సస్పెన్సా..?

Virupaksha Teaser : “విరూపాక్ష” టీజర్ వచ్చేసింది… మరీ ఇంత సస్పెన్సా..?

by Bunty
Ad

 

బైక్ ఆక్సిడెంట్ తర్వాత సాయితేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలిచిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అంచనాలు పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది.

READ ALSO : ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Advertisement

 

బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా కథ ఏంటన్న దానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది మూవీ. ఇదిలా ఉంటే, పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేసింది.

Advertisement

read also : దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..?

 

1.19 నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ ఆధ్యాంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్ చూస్తున్నంత సేపు ఊపిరి బిగపట్టుకొని చూసేలా టీజర్ ఉంది. హారర్ టచ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ కనిపిస్తోంది. అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తుంది. చాలాగ్యాప్ తర్వాత సాయితేజ్ చేసిన ఈ సినిమా ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చి పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.

READ ALSO : టిడిపి బిగ్ స్కెచ్.. మంత్రి రోజాపై పోటీకి అలేఖ్య రెడ్డి రెడీ ?

Visitors Are Also Reading