Home » విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్‌ చేసిన ఉమేష్ యాదవ్

విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్‌ చేసిన ఉమేష్ యాదవ్

by Bunty
Ad

 

విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు ఉమేష్ యాదవ్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తడబడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత పెసర్ ఉమేష్ యాదవ్ ఆసిస్ కు చుక్కలు చూపించాడు. చివరలో బ్యాట్ తో చెలరేగిన ఉమేష్ ఏకంగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ తరుణంలోనే ఉమేష్ యాదవ్ ఓ రికార్డుల తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వడంతో జట్టులోకి వచ్చిన ఉమేష్ అందివచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

READ ALSO : Shardul Thakur : మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫోటోలు వైరల్!

Advertisement

తాను సద్వినియోగం చేసుకున్న అవకాశం బ్యాట్ తో అనుకుంటే పొరపాటే. ఉమేష్, మూడో టెస్ట్ తొలి రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో. ఈ మ్యాచ్ లో పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ఉమేష్ 13 బంతుల్లో రెండు సిక్సర్లు, బౌండరీ సాయంతో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో ఉమేష్, ఓ విషయంలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. కోహ్లీ తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటి వరకు 24 సిక్సర్లు బాదగా, ఈ మ్యాచ్ లో కొట్టిన 2 సిక్సర్లు కలుపుకొని ఉమేష్ కూడా తన కెరీర్ లో అన్ని సిక్సర్లు బాదాడు.

Advertisement

READ ALSO : రాజమౌళికి అల్లు అరవింద్ మీద ఎందుకంత కోపం అంటే..ఆ విషయమే చిచ్చు పెట్టిందా ?

విరాట్ సిక్సర్ల రికార్డును సమం చేసే క్రమంలో ఉమేష్, టీం ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి (22 సిక్సర్లు), భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (22)ల రికార్డులను అధిగమించాడు. ఓవరాల్ గా చూస్తే, భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట ఉండగా, ధోని (78), సచిన్ టెండూల్కర్ (69), రోహిత్ శర్మ (68), కపిల్ దేవ్ (61) బరసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. ఉమేష్, విరాట్ తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు.

read also : పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు…అస్సలు ఊహించలేదు – లయ

Visitors Are Also Reading