Home » ‘జగ్‌ జగ్‌ జీయో’ ట్రైలర్ చూస్తే న‌వ్వు ఆపుకోలేరు..!

‘జగ్‌ జగ్‌ జీయో’ ట్రైలర్ చూస్తే న‌వ్వు ఆపుకోలేరు..!

by Anji
Ad

బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌, అందాల తార కియారా అద్వాణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం జ‌గ్ జ‌గ్ జీయో. రాజ్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దిగ్గ‌జ న‌టులు అనిల్ క‌పూర్‌, నీతూ క‌పూర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ది. ఈ త‌రుణంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆదివారం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసారు.

ఇక విడుద‌ల చేసి ఈ ట్రైల‌ర్‌లో అనిల్ క‌పూర్ యాక్టింగ్ అద‌ర‌గొట్టాడ‌నే చెప్ప‌వ‌చ్చు. అత‌ని యాక్టింగ్ చూస్తుంటే ఈ సినిమాకే హైలెట్ కానున్న‌ట్టు తెలుస్తోంది. వ‌రుణ్ ధావ‌న్‌, కియారా అద్వాణి, నీతూక‌పూర్ త‌మ‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే పుల్ లెంగ్త్ కామెడీ త‌ర‌హాలో సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. హీరో హీరోయిన్ల పెళ్లి, విడాకుల క‌థాంశంగా సినిమాను రూపొందించారు. ఈ సినిమాను య‌శ్ జోహార్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో ప్ర‌తి పాత్ర, ప్ర‌తి స‌న్నివేశం న‌వ్వు తెప్పించే విధంగా ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

Advertisement

Advertisement


ద‌ర్శ‌క, నిర్మాత‌లు విడుద‌ల చేసిన ఈ ట్రైల‌ర్‌లో హాస్య సన్నివేశాల‌తో పాటు ఓ వేడుక సంద‌ర్భంగా వ‌చ్చే సాంగ్‌తో ఈ ట్రైల‌ర్‌ను రూపొందించారు. ఈ ట్రైల‌ర్‌లో క‌నిపించే ప్ర‌తి పాత్ర క‌డుపుబ్బా న‌వ్వించేవిధంగా ఉంటుంది. ఈ ట్రైల‌ర్‌ను వీక్షించిన ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా కామెడీ సినిమాలు రాక‌పోవ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమాను వీక్షించాలంటే మాత్రం జూన్ 24 వ‌ర‌కు ఎదురుచూడాల్సిందే.

Also Read : 

 

 

Visitors Are Also Reading