Home » పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న నాగార్జున..!

పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న నాగార్జున..!

by Azhar
Ad
టాలీవుడ్ సీనియర్ హీరోలలో నాగార్జున ఒక్కరు. అయితే ప్రస్తుతం నాగార్జున యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా వేగంగా సినిమాలు అనేవి చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా నాగార్జున నుండి వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం అనేది వహించారు. లెక్క ప్రకారం ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కావాలి. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల ఆలస్యం ఆయేలా కనిపిస్తుంది.
అందుకు కారణం ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలనీ చూస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా పాన్ ఇండియా సినిమా గా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. దాంతో ఆయనకు మంచి గుర్తింపు అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో వారి సినిమాల కంటే మన తెలుగు సినిమాలే ఎక్కువగా ఆడుతున్నాయి అనేది అందరికి తెలిసిందే.
అయితే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ది ఘోస్ట్ సినిమాను తెలుగుతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి తోడు ఓ హిందీ డిస్టిబ్యూటర్ కూడా ది ఘోస్ట్ సినిమాను హిందీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయడనికి కొంత ఆలస్యం అవుతుంది అని తెలుస్తుంది. చూడాలి మరి ది ఘోస్ట్ హిందీలో రిలీజ్ అవుతుందా.. లేదా అనేది.

Advertisement

Visitors Are Also Reading