Home » కుక్క‌లు ఆకాశం వైపు చూస్తూ పెద్ద‌గా అరుస్తుంటాయి ఎందుకో తెలుసా..?

కుక్క‌లు ఆకాశం వైపు చూస్తూ పెద్ద‌గా అరుస్తుంటాయి ఎందుకో తెలుసా..?

by Anji
Ad

మాన‌వుడితో మొద‌ట‌గా స‌హ‌వాసం చేసిన జంతువు ఏదైనా ఉందంటే ఒక కుక్క మాత్ర‌మే. పెంపుడు జంతువుల్లో ఇప్ప‌టికీ మ‌నతో తొంద‌ర‌గా స్నేహం చేస్తుంటుంది. జంతువుల‌న్నింటికెల్లా కేవ‌లం కుక్కకు మాత్ర‌మే విశ్వాసం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే చాలా సంద‌ర్భాల్లో కుక్కకు ఉన్న విశ్వాసం కూడా లేద‌ని వాడుతుంటారు. కుక్క ముఖ్యంగా పెంచుకున్న వ్య‌క్తిని ఒక్క రోజు చూడ‌లేకుండా ఉండ‌లేవు. కొన్ని సంద‌ర్భాల్లో పెంచుకున్న వ్య‌క్తి క‌నిపించేంత వ‌ర‌కు కూడా ఆహారాన్ని ముట్ట‌వు. కుక్క‌లు న‌మ్మ‌క‌మైన‌వ‌ని, విశ్వాసం గ‌ల జంతువులుగా పిల‌వ‌బతున్నాయి.

Advertisement

కుక్క‌ల‌కు ఉన్న‌టువంటి ప‌ద్ద‌తుల‌ను మార్చుకోవు అటువంటి ప‌ద్ద‌తుల్లో ఒక‌టి యూరిన్ పోయ‌డం, మ‌రొక‌టి ప‌డుకునే విధానం. ప్ర‌ధానంగా కుక్కులు పెంపుడు కుక్క‌లుగా కాక ముందు కుక్క‌లు అర‌ణ్య ప్రాంతాల్లో తిరుగుతూ జీవించేవి. అడ‌విలో వాటికి కావాల్సిన ఆహారంను అవే స‌మ‌కూర్చుకునేవి. అడ‌విలో వేటాడి స‌మ‌కూర్చుకున్న ఆహారంను భూమిలో గుంత‌లు త‌వ్వి ఆ గుంటల్లో దాచుకునేవి అట‌. ఆహారం దొర‌క‌ని సంద‌ర్భంలో ఆ గుంట‌లో దాచుకున్న ఆహారం ప‌రిస్థితుల‌క‌నుగుణంగా జాగ్ర‌త్త‌గా తినేవి. కుక్క‌లు వాతావ‌ర‌ణం వేడి ఉన్న‌ప్పుడు ఆ అడ‌విలో గుంట‌లు త‌వ్వి ఆ గుంటల్లో ప‌డుకునేవి. అడ‌విలో కుక్క‌లు ఈ విధంగా త‌మ జీవితాన్ని కొన‌సాగించేవి.

Advertisement

కుక్క‌లు త‌మ తోటి కుక్క‌ల‌తో క‌లిసి ఆహారంను వెళ్తూ ఉండ‌డానికి చంద‌మామ క‌నిపించ‌గానే పెద్ద‌గా అరుస్తుంటాయి. ఈ కుక్క‌లు అడ‌వుల నుంచి జ‌నాల్లోకి వ‌చ్చిన త‌రువాత కూడా వాటి అల‌వాట్లు పోలేదు. కుక్క‌లు ఆకాశం వైపు చూస్తూ గుంపులు గుంపులుగా ఏర్ప‌డి పెద్దగా అరుస్తుంటాయి. ఇప్పుడు కూడా ఊర కుక్క‌లు బ‌జార్ల‌లోకి వ‌చ్చి రోడ్ల‌పై ఆకాశం వైపు చూస్తూ అరుస్తూ ఉంటాయి. ఈ విధంగా కుక్క‌లు అరుస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో అనేక ర‌కాల అపోహ‌ల‌కు పోతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు భ‌యబ్రాంతుల‌కు గుర‌వుతుంటారు.

ALso Read : 

మీరు డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఈ సూప్స్‌ తాగితే క‌చ్చితంగా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది..!

తెలంగాణ‌లో ఎంసెట్ వాయిదా.. భారీ వ‌ర్షాల కార‌ణంగా అధికారులు కీల‌క నిర్ణ‌యం..!

Visitors Are Also Reading