Home » మీరు డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఈ సూప్స్‌ తాగితే క‌చ్చితంగా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది..!

మీరు డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఈ సూప్స్‌ తాగితే క‌చ్చితంగా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది..!

by Anji

ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మందిని వేదిస్తున్న స‌మ‌స్య డ‌యాబెసిటిస్‌. ఆధునిక జీవన‌శైలిలో మార్పులు, ప‌ని ఒత్తిడి, చెడు ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా ప్ర‌కారం.. ప్ర‌పంచంలో దాదాపు 422 మిలియ‌న్ల మంది డ‌యాబెటిస్ బారిన ప‌డ్డారు. షుగ‌ర్ కార‌ణంగా ప్ర‌తీ ఏడాది 1.5 మిలియ‌న్ల మంది మ‌ర‌ణిస్తున్నారు. డ‌యాబెటిస్ కార‌ణంగా మ‌నిషి స‌గ‌టు ఆయుర్ధాయం త‌గ్గిపోతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయి హెచ్చు, త‌గ్గుద‌ల కార‌ణంగా డ‌యాబెటిక్ రోగుల‌కు తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది.

డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోకుంటే కిడ్ని, గుండె, ఊపిరితిత్తులు. కంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం పొంచి ఉంది. ఈ పేషెంట్లు మెరుగైన జీవితం గ‌డ‌ప‌డానికి మ‌ధుమేహాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాల‌ని నిపుణులు సిఫార‌సు చేస్తున్నారు. మ‌ధుమేహం పూర్తిగా త‌గ్గ‌డానికి చికిత్స లేదు. కానీ కంట్రోల్ చేసుకోవ‌డానికి మాత్రం మందుల‌పై ఆధార‌ప‌డ‌వ‌చ్చు. మందుల‌పై ఆధార‌ప‌డ‌డం మంచిది కాద‌ని నిపుణులు పేర్కొంటారు. ఆహారంలో మార్పులు, క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌డం ద్వారా డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చని పేర్కొంటున్నారు. ఆయుర్వేద చిట్కాలు ర‌క్తంలోని చ‌క్క‌ర స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డానికి స‌హాయ‌ప‌డుతాయ‌ని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

ప్ర‌ధానంగా డ‌యాబెటిక్ పేషెంట్ల‌లో బ్ల‌డ్ షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంచ‌డానికి సోర‌కాయ సూప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. టిఫిన్ ద్వారా లేదా రాత్రి భోజ‌నం త‌రువాత పొట్ల‌కాయ‌-మున‌క్కాయ సూప్ తీసుకోవ‌డం మంచిది. వారానికి రెండు సార్లు ఈ సూప్స్ తీసుకుంటే డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగ‌ర్ రోగులు ప్ర‌తి రోజూ డైట్‌లో ఉసిరి, ప‌సుపు చేర్చుకుంటే చాలా మంచిది. భోజ‌నానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఆమ్లా, ఒక స్పూన్ ప‌సుపు వేసుకొని తాగితే మంచిది. తాజా కూరగాయ‌లు, పండ్లు ఎక్కువ‌గా తీసుకొండి. బ‌చ్చలికూర‌, మెంతికూర‌, టొమాటో, కాక‌ర‌కాయ‌, మున‌గ వంటి కూర‌గాయలు మీ ఆహారంలో తీసుకోండి. ఇక పండ్ల విష‌యానికొస్తే యాపిల్‌, ఉసిరి, బొప్పాయి, దానిమ్మ‌, బొప్పాయి, కివి వంటి పండ్ల‌ను తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

Also Read : 

పుష్ప -2 సినిమాకి అల్లుఅర్జున్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమా అందుకే ఆగిపోయిందా..?

 

Visitors Are Also Reading