Home » తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల తేదీ వ‌చ్చేసింది.. ఎప్పుడంటే..?

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల తేదీ వ‌చ్చేసింది.. ఎప్పుడంటే..?

by Anji
Published: Last Updated on
Ad

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల‌పై ఎట్ట‌కేల‌కు ఓ క్లారిటీ వ‌చ్చింది. ఇవాళ రేపు అని నిన్న మొన్న జ‌రిగిన ప్ర‌చారానికి తెలంగాణ రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు అధికారులు తెర‌దించారు. జూన్ 28న ఉద‌యం 11 గంట‌ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు వెల్ల‌డిస్తార‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ ఇంట‌ర్మీడియట్ ప‌రీక్ష ఫ‌లితాలు 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. అయితే ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేస్తారు.


ముఖ్యంగా ఇంట‌ర్ ఫ‌లితాల‌పై వ‌స్తున్న వదంతులు, సృష్టిస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌ను పేరెంట్స్ త‌ల్లిదండ్రులు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఇంట‌ర్ బోర్డు అధికారులు త‌మ ప్ర‌క‌ట‌న ద్వారా విజ్ఞ‌ప్తి చేసారు. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల‌ను స్టూడెంట్స్ వారి త‌ల్లిదండ్రుల‌ను మూడు వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in వెబ్ సైట్ల ద్వారా విద్యార్థులు ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు. తెలంగాణ‌లో మే 06 నుంచి 24 వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులంద‌రూ క‌లిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.

Advertisement

Advertisement

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల‌పై పూట‌కొక ప్ర‌చారం జరిగింది. ఎగ్జామ్స్ రాసిన విద్యార్థుల‌తో పాటు త‌ల్లిదండ్రుల్లో నెల‌కొన‌డంతో బోర్డు సైతం క్లారిటీ ఇచ్చింది. మ‌రోవైపు ఎంసెట్ ఎగ్జామ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఇంట‌ర్ ఫ‌లితాల కోసం స్టూడెంట్స్ ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మార్కులు ఎక్క‌డ తారుమారు అవుతాయోన‌నే సందేహం నెల‌కొని మార్కుల‌ను క్రోడీక‌రించ‌డంలో ఎలాంటి త‌ప్పులు దొర్ల‌కుండా ఉండేందుకు బోర్డు అధికారులు ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు. ఫ‌లితాల్లో త‌ప్పులు దొర్ల‌కుండా ఒక‌టికి రెండు సార్లు అధికారులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు.

 

Also Read : 

రామ్ పోతినేని పెళ్లికి ముహుర్తం ఖారారు.. పెళ్లి కూతురు ఎవ‌రంటే..?

రోహిత్ పై తన కోపాన్ని వ్యక్తపరిచిన పాండ్య…!

 

Visitors Are Also Reading