Home » అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

by Anji
Ad

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన తరువాత మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.  

Also Read :  ANR: తెలుగు ఇండస్ట్రీ HYD రావడానికి చర్చ్ పార్క్ స్కూల్ కి సంబంధం ఏంటో తెలుసా..?

Advertisement

agent-review

విడుదలైన రోజు నుంచే ఏజెంట్ కి ప్లాప్ టాక్ రావటంతో రెండోరోజు నుంచి జనాలు థియేటర్ కి వెళ్లడం మానేశారు. గత సినిమాలతో పోల్చితే.. అఖిల్ పెర్పామెన్స్ పర్వాలేదనిపించినా.. కథలో ఎలాంటి ఎమోషన్ లేకపోవడంతో ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం ఈ మూవీని సేవ్ చేయలేకపోయాడు. ఏజెంట్ ప్లాప్ విషయంపై నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ.. ‘కథ పూర్తిగా లేకుండా, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా షూట్ చేయడం వల్లనే ఏజెంట్ మూవీ ప్రేక్షకులక నచ్చలేదు. ఏజెంట్ మూవీ ప్లాప్ కి మేము పూర్తి బాధ్యత వహిస్తున్నాం. మీరు మాపై పెట్టుకొన్న నమకాన్ని రీచ్ అవ్వనందుకు క్షమించండి. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకుంటాం’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అనిల్ సుంకర.  

Advertisement

Also Read :   విడిపోయిన తర్వాత మళ్లీ దగ్గర కాను.. వైరల్ అవుతున్న చైతు కామెంట్స్..!!

ఏజెంట్ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ ని సోనిలైవ్ సంస్థ కొనుగోలు చేిసంది. సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో సోనీలైవ్ ద్వారా ఏజెంట్ మూవీని త్వరలోనే విడుదల చేస్తున్నారంట. మే 19 నుంచి ఏజెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. థియేటర్లో మోస్తారుగా ఆడుతుండటంతో వచ్చే వారం సినిమా రిపోర్ట్స్ చూసి అధికారికంగా డేట్  ప్రకటన చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్లాప్ టాక్ తో నడుస్తున్న ఏజెంట్ కి ఓటీటీ విడుదల కూడా ఇంత తొందరగా వస్తే ఇంకా సినిమా బిజినెస్ ఎంత లాస్ తో ముగుస్తుందో వేచి చూడాలి. 

Also Read :  “నేను చస్తే తప్ప సినిమాలకు దూరం కాను”.. నరేష్ సంచలన వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading