Home » చైనా క్రికెట్ ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

చైనా క్రికెట్ ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

by Anji
Ad

సాధార‌ణంగా ఎవ్వ‌రు ఏదో ఒక క్రీడ‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకున్న‌ట్ట‌యితే ఫుట్‌బాల్‌, క్రికెట్ అభిమానులు చాలా ఎక్కువ‌గా ఉంటారు. చాలా మంది క్రికెట్‌ను ఫాలో అవుతుంటారు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఆరోజు స్కూలైనా, కాలేజైనా సెలవు పెట్టాల్సిందే. మ్యాచ్ ను ఎంజాయ్ చేయాల్సిందే. బ్యాటింగును ఆస్వాదించాల్సిందే. లేదంటే వారికి మనసు కుదుటపడదు. క్రికెట్ అంటే ఓ వ్య‌స‌నంలా మారిపోతుంది. క్రికెట్ గురించి చాలా మంది ఎక్క‌డైనా చ‌ర్చించుకోవ‌డం విశేషం. భార‌త్‌లో అయితే జాతీయ స‌మైక్య‌త భావం కేవ‌లం క్రికెట్‌లోనే ఉంద‌న్న ఫీలింగ్ అంద‌రిలో ఉండ‌డం గ‌మనార్హం.


ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపించిన‌ప్ప‌టికీ చైనా మాత్రం క్రికెట్ ఆడేందుకు ముందుకు రాలేదు. దానికి రెండు కార‌ణాలున్నాయి. చైనా ఒలంపిక్స్ క్రీడ‌ల్లో అత్య‌ధిక ప‌థ‌కాలు సాధిస్తున్న దేశం. క్రికెట్ ఒలంపిక్స్ లేని ఆట కావ‌డంతో దృష్టి సారించ‌దు. చైనాకు కూడా క్రికెట్ టీమ్ ఉంది. వారు ఏవేదిక‌ల మీదికి పోటీకి ఎక్కువ‌గా దిగ‌రు. క్రికెట్ ఆడే దేశాల‌న్నీ ఇంగ్లాండ్ పాల‌న‌లో మ‌గ్గిన‌వే కావ‌డం ఇక్క‌డ మ‌రొక కార‌ణం. చైనా ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ వారికి త‌లొగ్గ‌లేదు. చైనా ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ వారికి త‌లొగ్గ‌లేదు. దీంతో వారు క్రికెట్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌ర‌ని తెలుస్తోంది. 2009 ఐసీసీ ట్రోఫీ ఛాలెంజ్ లో చైనా పాల్గొంది.

Advertisement

Advertisement

మొదటి మ్యాచ్‌లో ఓట‌మి పాలైంది. త‌రువాత మ‌య‌న్మార్‌తో జ‌రిగిన మొద‌టి ఇంట‌ర్నేష‌న‌ల్ విజ‌యం న‌మోదు చేసింది. చైనాలో కూడా క్రికెట్ ను ప్ర‌మోట్ చేస్తున్న ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. 2019లో జ‌రిగిన టీ-20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్ లో విజయం సాధించింది. అడపాదడపా ఆడుతున్న క్రికెట్ పై పూర్తిస్థాయిలో క్రికెట్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. ఏదో నామ్ కే వాస్తేగా క్రికెట్ ను బలమైన ఆటగా గుర్తించడం లేదని తెలుస్తోంది.


ముఖ్యంగా చైనా వాసులు ఒలంపిక్స్ స్వ‌ర్ణ ప‌థ‌కాలు సాధించ‌డం పైనే గురి ఉంటుంది. ఇత‌ర ఆట‌ల జోలికి వెళ్ల‌రు. క్రికెట్ అంటే మొత్తానికి వారికి న‌చ్చ‌దు. మొక్కుబ‌డిగా ఆడ‌తారు త‌ప్ప ఆస‌క్తితో మాత్రం కాదు. అందుకే వారు ఇంకా క్రికెట్‌లో ఆరితేర‌లేదు. క్రికెట్ ను ఎక్కువగా ఇష్టపడితేనే దానిపై పట్టు సాధిస్తారు. అంతేకానీ ఏదో తూతూ మంత్రంగా ఆడితే అంతే సంగతి. దీంతో క్రికెట్ కు చైనా ఇప్పట్లో ప్రాధాన్యం ఇచ్చే విధంగా కనిపించడం లేదు. ఫలితంగా వారు పోటీల్లో కూడా ముందుకు రావడం లేదు. అందుకే క్రికెట్ అంటే చైనీయుల‌కు ఇష్టం లేని క్రీడగా గుర్తింపు పొందింది.

Also Read : 

లైగర్ ట్రైలర్ లో విజయ్ 199 రూపాయల చెప్పులు ధరించడం వెనుక ఇంత కథ ఉందా..?

ధావన్ కు నో ఛాన్స్.. ఇంకో కెప్టెన్ రాబోతున్నాడు..?

Visitors Are Also Reading