Home » లైగర్ ట్రైలర్ లో విజయ్ 199 రూపాయల చెప్పులు ధరించడం వెనుక ఇంత కథ ఉందా..?

లైగర్ ట్రైలర్ లో విజయ్ 199 రూపాయల చెప్పులు ధరించడం వెనుక ఇంత కథ ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు పొంది తాజాగా ఆయన లైగర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కొందరి హీరోల అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయట. అయితే ఆయన తాజాగా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

విజయ్ దేవరకొండ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో చాలా సింపుల్ గా రెడీ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి కారణం ఏంటో అతని పర్సనల్ స్టైలిస్ట్ హార్మన్ కౌర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలామంది వ్యాపారవేత్తలు వారికి సంబంధించిన బ్రాండ్స్ ను ధరించాలని విజయ్ వద్దకు వచ్చారట. దీంతో విజయ్ వాటిలో కొన్నింటిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. కానీ ట్రైలర్ లాంచింగ్ కి ముందు రోజు మాత్రం విజయ్ దేవరకొండ వారికి కాల్ చేసి నేను సెలెక్ట్ చేసినవి ఏమీ వద్దు అని చెప్పారట. ఈ మూవీలో అండర్డాగ్ పాత్రకి తగినట్టు సహజంగా సింపుల్ గా ఉంటానని చెప్పుకొచ్చారట.. ఆయన చెప్పినట్టుగానే స్లిప్పర్స్ వేసుకొని రిలీజ్ ఫంక్షన్ కి వచ్చారని తెలుస్తోంది.

Advertisement

ఆయన ఆ స్లిప్పర్స్ వేసుకోవడంపై కొన్ని విషయాలు విజయ్ చెప్పారని దానిపై మేము ఆలోచించమని అన్నారు. విజయ్ దేవరకొండ ఎలాంటి బ్రాండ్స్ ధరించిన దేశం మొత్తం అతని గురించి మాట్లాడుకునే ఔట్ పిట్స్ ఉంటుందని మా నమ్మకం. అందుకే విజయ్ దేవరకొండ చెప్పినట్లు టీ షర్టు,199 రూపాయల చెప్పులను కొన్నట్లు తెలుస్తోంది. ముంబై లాంటి పెద్ద నగరాలలో 199 రూపాయల చొప్పున వేసుకుంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మేము కొంత ఆలోచించాం. కానీ విజయ్ ఏమి ఆలోచించకుండా వాటిని ఫైనల్ చేసి వేసుకొని వచ్చారని అన్నారు. దీంతో ఆయన ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ కి చాలామంది సంతోషపడ్డారని వెల్లడించింది.

ALSO READ:

 

Visitors Are Also Reading