Home » భోళా శంకర్ నుంచి ఆసక్తికర అప్డేట్.. పవన్ పాటకు స్టెప్పులేసిన మెగాస్టార్..!

భోళా శంకర్ నుంచి ఆసక్తికర అప్డేట్.. పవన్ పాటకు స్టెప్పులేసిన మెగాస్టార్..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. మహానటి కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. 

Advertisement

అదేవిధంగా సుశాంత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భోళా శంకర్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఓ రేంజ్ లో సెన్షేషన్ సృష్టించాయి. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త లీక్ చేస్తూనే ఉన్నారు. తాజాగా భోళా శంకర్ మూవీ నుంచి మరో సీన్ ని లీక్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానిగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇదే నిజమైంది.

తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేశారు. పవన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి సినిమాలోని యే మేరా జహా పాటను అచ్చం పవన్ లాగే ఇమిటేట్ చేశారు చిరంజీవి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ తన సినిమాలో నన్ను.. నా డైలాగులు, నా సాంగ్స్ కి డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు నేను అందరినీ అలరించడానికి భోళా శంకర్ లో పవన్ మేనరిజమ్ లను అనుకరిస్తాను. ఆడియెన్స్ వీటిని ఆనందిస్తారని ఆశిస్తాను అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. థియేటర్లలో ఈ సీన్ కి మెగా అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారని.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ ముగ్గురు హీరోల గురించి రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్..!

ఎన్టీఆర్ మూవీలో అల్లు అర్హ.. నిమిషానికి అన్ని లక్షల పారితోషికమా..?

Visitors Are Also Reading