Home » షాక్ అయ్యే రేంజ్ లో సీరియ‌ల్ హీరోయిన్ల‌ రెమ్యున‌రేష‌న్స్…ఒక్క రోజుకు ఎంత తీసుకుంటున్నారంటే..?

షాక్ అయ్యే రేంజ్ లో సీరియ‌ల్ హీరోయిన్ల‌ రెమ్యున‌రేష‌న్స్…ఒక్క రోజుకు ఎంత తీసుకుంటున్నారంటే..?

by AJAY
Ad

Telugu Serial Actress list and Remunerations: సినిమాల‌కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో సీరియ‌ల్స్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ ఎక్కువ‌గా సీరియ‌ల్స్ ను ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. ఇంట్లో ప‌నంతా పూర్తి చేసిన త‌ర‌వాత సీరియ‌ల్స్ కు అతుక్కుపోతుంటారు. ఎంత బీజీ పనులు ఉన్నా ప‌క్క‌న పెట్టి సీరియ‌ల్స్ ను చూస్తుంటారు. కాబ‌ట్టి సీరియ‌ల్స్ కు ఏ రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ వ‌స్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక అందులో న‌టించే వారికి కూడా రెమ్యున‌రేష‌న్ లు ఎక్కువ‌గానే ఉంటాయి. లీడ్ రోల్ చేసే వాళ్ల రెమ్యునరేష‌న్ తెలిస్తే మాత్రం షాక్ అయ్యే రేంజ్ లోనే ఉంటాయి. కాబ‌ట్టి ఓసారి సీరియ‌ల్ హీరోయిన్స్ రెమ్యున‌రేష్ గురించి తెలుసుకుందాం…!

Advertisement

Also Read:  టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కలిగిన హీరో ఎవరు ? టాప్ లో ఉన్నది ఏ హీరో అంటే ?

కార్తీక‌దీపం సీరియ‌ల్ లో వంట‌ల‌క్క ఎంత ఫేమ‌స్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమి విశ్వనాథ్ కాగా ఒక్క రోజుల‌కే ఈ న‌టి రూ.25వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.

ఒక‌ప్పుడు సినిమాల్లో న‌టించిన సుహాసిని ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ లో న‌టిస్తోంది. ఇక సుహాసిని ఒక్క రోజుకు రూ.20 వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది.

Advertisement

బుల్లితెర అనుష్క‌గా పేరు సంపాదించికున్న సీరియ‌ల్ హీరోయిన్ ప‌ల్ల‌వి రామిశెట్టి. ఈ బ్యూటీ ఒక్క రోజుకు 15వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. చంద్ర‌ముఖి సీరియల్ తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన న‌టి మంజుల‌. ఈమె సీరియ‌ల్ హీరో నిరుప‌మ్ ను పెళ్లి చేసుకుంది. మంజుల ఒక్క‌రోజుకు రూ.8000 రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. సీరియ‌ల్ హీరోయిన్ గా అభిమానుల‌ను సంపాదించుకున్న స‌మీర అదిరింది షోకు యాంకర్ గా కూడా చేసింది.

Also Read:  సీరియస్ లుక్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఫస్ట్ మూవీతోనే ఫుల్ ఫాలోయింగ్..!

ఇక స‌మీర ఒక్క రోజుకు రూ.10వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది. క‌థ‌లో రాజ‌కుమారిసీరియ‌ల్ తో పాపులారిటీ సంపాదించుకున్న న‌టి అషికా ఒక్క రోజుకు రూ.12వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. అంతే కాకుండా తెలుగులో ప‌లు సూప‌ర్ హిట్ సీరియ‌ల్స్ లో నటిస్తున్న హ‌రిత రోజుకు రూ.12 వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.

నా పేరు మీనాక్షి సీరియ‌ల్ తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ న‌వ్య‌స్వామి. ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న నవ్య‌స్వామి రోజుకు రూ.20వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది.

Also Read:  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Visitors Are Also Reading