Home » Icc world cup 2023 : వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్, చాహాల్ ఔట్!

Icc world cup 2023 : వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్, చాహాల్ ఔట్!

by Bunty
Ad

బీసీసీఐ పాలకమండలి కీలక ప్రకటన చేసింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కోసం తాజాగా టీమిండియా అని జట్టును ప్రకటించేసింది బీసీసీఐ పాలకమండలి. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు… ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఈ ఏడాది ఇండియాలో జరగనున్నది. ఈ టోర్నమెంట్ కు మరో నెల రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా జట్టును ప్రకటించేసింది బీసీసీఐ పాలకమండలి. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కు టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ… వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొనసాగనున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది బీసీసీఐ పాలకమండలి. అయితే ఇవాళ ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో…. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరియు చాహల్ పేరు మాత్రం లేదు.

Advertisement

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (విసి), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

Visitors Are Also Reading