Telugu News » Blog » తారక్ మనసు బాలేకపోతే చూసే సినిమా అదేనట..!!

తారక్ మనసు బాలేకపోతే చూసే సినిమా అదేనట..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారారు. ఇప్పటికే సినిమా, రికార్డులు క్రియేట్ చేసి ఆస్కార్ అవార్డు అందుకొని మరింత గుర్తింపును అందించింది. ఇదిలా ఉండగా తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ దృష్టిపడింది. ఆయన నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ కొద్ది రోజులుగా సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఇప్పటికే అమిగోస్, బింబిసారా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ..

Advertisement

also read:ఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడా…?

Advertisement

తాజాగా విశ్వక్సేన్ నటిస్తున్న దాస్ కా దంకి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ వేడుకలో పాల్గొని ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.. విశ్వక్సేన్ చాలా టాలెంట్ ఉన్న నటుడని అశోక వనంలో అర్జున కళ్యాణం ఫ్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నారు జూనియర్ ఎన్టీఆర్.

also read:తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్… ఆన్లైన్ లో హాల్ టికెట్లు…!

అలాగే తన మనసు బాలేనప్పుడు కొన్ని చిత్రాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని అందులో ముఖ్యంగా చెప్పుకునేది ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం అని చెప్పారు. తన మూడు బాలేకపోతే తప్పనిసరిగా ఈ మూవీ చూస్తానని అన్నారు. ఈ చిత్రంలో విశ్వక్ కామెడీ చేయకుండానే నవ్విస్తాడని మనసులో బాధను దాచుకొని ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టమని కానీ విశ్వక్ నటన చూసి కొన్నిసార్లు ఆశ్చర్యపోయానని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కేవలం విశ్వక్సేన్ కోసం రాలేదని తాను ఓ అభిమానిని అని ఆలోచించుకొని ఇక్కడికి వచ్చారని అన్నారు.

Advertisement

also read:ఫ్యాన్స్ కు షాక్… సూర్యకుమార్ రిటైర్మెంట్?