తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 3 నుంచి జరిగే పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?
Advertisement
విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు పాఠశాలలకు కూడా పంపుతున్నట్లు మంత్రితో చెప్పారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు అనేక సూచనలు చేశారు.
READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు మూడు గంటలు జరిగితే, సైన్స్ పరీక్ష మాత్రం మూడు గంటల 20 నిమిషాలు జరుగుతుంది. గతంలో లాగే కాకుండా ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించబోతున్నారు.
READ ALSO : తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!