టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ గురించి తెలియనివారు ఉండరు. ఈ సూర్యభాయ్ టి20 లో ఐసీసీ నెం.1 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. టి20 క్రికెట్లో అతన్ని ఆపే శక్తి ఏ బౌలర్ కు లేదన్న తరహాలో రెచ్చిపోతుంటాడు. 2021 మార్చిలో టి20 అరంగేట్రం తర్వాత ఒకటికి మూడు సెంచరీలు బాదిన సూర్య కుమార్ యాదవ్ రెండేళ్లలో 13 హాఫ్ సెంచరీలు చేసి 46.52 సగటుతో 1675 పరుగులు చేశాడు. ఇది పొట్టి క్రికెట్లో అతని గణాంకాలు.
Advertisement
READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్
కానీ వన్డే ఫార్మాట్ కు వచ్చేసరికి మాత్రం సూర్య కుమార్ తేలిపోతున్నాడు. దూకుడుకు మారుపేరైన సూర్య వన్డే లో మాత్రం ఇమడలేకపోతున్నాడు. టీ20 లో అరంగేట్రం చేసిన మూడు నెలల్లోనే అంటే 2021 జూలైలో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్ల్లో 19 ఇన్నింగ్స్ లు ఆడి 27.06 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో అతని ఖాతాలో ఇప్పటివరకు కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.
Advertisement
READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేల్లో సూర్య కుమార్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. గత పది మ్యాచ్ ల్లో సూర్య చేసిన స్కోర్లు వరుసగా 13, 9, 8, 4, 34, 6, 4, 31, 14,0 పరుగులు చేశాడు. ఒక్క మ్యాచ్ లో కూడా ఫిఫ్టీ మార్క్ అందుకోలేకపోయిన సూర్య ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్ కి పెవిలియన్ చేరాడు. దీంతో వన్డేలకు గుడ్ బై చెప్పి కేవలం టి20 లు ఆడాలని సూర్యకు కొంతమంది సలహాలు ఇస్తున్నారు.
Advertisement
READ ALSO : ‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!