Home » ఆయుర్వేదం ప్రకారం ఇలా పండ్లు ని తీసుకుంటే.. ఆరోగ్యం బావుంటుంది…!

ఆయుర్వేదం ప్రకారం ఇలా పండ్లు ని తీసుకుంటే.. ఆరోగ్యం బావుంటుంది…!

by Sravya

ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. పండ్లను తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. మనకి అందుబాటులో చాలా రకాల పండ్లు ఉంటాయి. అయితే పండ్లను తీసుకోవడానికి కూడా పద్ధతులు ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం సీజనల్ ఫ్రూట్స్ని తినడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని నిపుణులు చెప్పడం జరిగింది. బాగా పండిన పండ్లు తింటే ఈజీగా జీర్ణం అవుతాయి. వాటిలో పోషకాలు శరీరానికి బాగా అందుతాయి సీజనల్ ఫ్రూట్స్ ని తీసుకుంటే ప్రకృతి జ్ఞానంతో సమలేఖనం అవుతుంది.

ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫా దోషాలు ఉంటాయి. శరీర లక్షణం ఆధారంగా ఆహారాన్ని ఎంచుకోవాలని ఆయుర్వేదం చెప్పింది. వాత దోషం ఉంటే, అరటి పండ్లు అవకాడో వంటి పండిన తీపి పండ్లను తీసుకోవాలి. పిత్త దోషం ఉన్నట్లయితే బెర్రీస్, చెర్రీస్, పుచ్చకాయ వంటికి తీసుకోవాలి. కఫ దోషం ఉంటే ఆపిల్స్, దానిమ్మ తీసుకోవాలి ఇలా పండ్లు తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. పాలు తృణధాన్యాలతో పండ్లు కలిపి తీసుకోకూడదు జీర్ణ సమస్యలు కలుగుతాయి.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading