Swami Vivekananda Quotes, Quotations in Telugu:భారతదేశం యొక్క ఖ్యాతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంతో పాటు పాశ్చాత్య దేశాల్లో కూడా తన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచారు స్వామి వివేకానంద. ప్రతి యేటా జనవరి 12న వివేకానంద జయంతి ఉత్సవాలు విజయానికి స్ఫూర్తి.. వివేకానంద సూక్తులు భారతదేశంతో పాటు పలు దేశాల్లో ఘనంగా నిర్వహిస్తుంటారు. వివేకానంద చెప్పిన కొన్ని సూక్తులను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read: Best Motivational and Inspirational Quotes and in Telugu, తెలుగు కొటేషన్స్
Swami Vivekananda Quotes in Telugu 
Swami Vivekananda Messages in Telugu
- ‘రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్బుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.’
- ‘మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి.’
- ‘ఎవరి కోసమో, దేనికోసమో ఎదురుచూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి’.
- ‘మిమ్మల్ని శారీరకంగా మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే దేనిని అయినా విషంతో సమానంగా భావించి తిరస్కరించండి.’
- ‘ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనీయండి మిగతా ఆలోచనలను పక్కకు పెట్టండి ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది.’
- ‘మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.’
- ‘జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు.. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.’
- ‘చావు బతుకులు ఎక్కడో లేవు.. ధైర్యంలోనే బతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.’
- ‘పోరాటంలోనైనా మృత్యువులోనైనా మీ శక్తినే నమ్ముకోండి ప్రపంచంలో పాపం అనేది ఉంటే.. అది మీ బలహీనత మాత్రమే.’
- ‘అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే విజయ సాధనకు మార్గాలు.’
- ‘కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడుతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం దృఢ నమ్మకం.’
Swami Vivekananda Quotes in Telugu Images
#1 )
Best vivekananda quotes and quotations in telugu (1)
#2)
Advertisement
#3) స్వామి వివేకానంద మంచి సూక్తులు
#4) స్వామి వివేకానంద కొటేషన్స్
#5) Swami Vivekananda Quotes Quotations in Telugu: స్వామి వివేకానంద తెలుగు సూక్తులు
#6) విద్యార్థులకు మంచి మాటలు
#7) మంచి మాటలు సూక్తులు
Advertisement
Also Read: Happy Sankranti Wishes, Quotes, Images, Greetings in Telugu 2023