Home » సూర్యకుమార్ యాదవ్ ఇంత అద్భుతంగా ఆడేందుకు అతని భార్య పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ?

సూర్యకుమార్ యాదవ్ ఇంత అద్భుతంగా ఆడేందుకు అతని భార్య పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

భారత ప్రముఖ క్రికెటర్ సూర్య కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవసరమే లేదు. ప్రధానంగా 2022 సంవత్సరం సూర్యకుమార్ కి ఒక తీపి గుర్తుగా మిగిలిపోనుంది. టీ 20 ఫార్మాట్ లలో ఈ ఏడాది రెచ్చిపోయి ఆడాడు. అంతర్జాతీయ టీ-20లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.

Advertisement

ముఖ్యంగా సూర్యకుమార్ పేరు చెబితే ప్రపంచంలోని ఏ బౌలర్ అయినా ఉలక్కిపడుతుంటాడు. అతడిని ఔట్ చేసేందుకు ఏ బౌలర్ దగ్గర కూడా సరైన బంతి లేదు. ఫలానా షాట్ ఆడితే అవుటవుతాడనే నమ్మకం ఎవరికీ లేదు. బంతి ఎక్కడ వేస్తే అక్కడ పరుగులు సమర్పించకుండా బతికిపోతాడేమో అని ఆలోచించని బౌలర్ల లేడు ప్రస్తుతం సునామీ టీ-20 వరల్డ్ కప్ 2022లో తన ప్రతాపం చూపుతోంది.

సూర్య తుఫాన్ కి ఇప్పటికే జింబాబ్వే జట్టు కొట్టుకుపోయింది. చివరి ఐదు ఓవర్లు మ్యాచ్ కే కాదు.. మొత్తం టోర్నీకే హైలెట్ గా నిలిచాయి అంటే అతిశయోక్తి కాదు.. సూర్య ఆడుతున్న షాట్లకు ఏ పేరు పెట్టాలో తెలియక కామెంటర్లు సైతం తికమకపడుతున్నారంటే..సూర్య ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నాడో  ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల టీ-20 ప్రపంచ కప్ లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కేవలం 25 బంతులు ఎదుర్కున్న సూర్యకుమార్ యాదవ్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి దుమ్మురేపాడు. కేవలం ఆ ఒక్క ఇన్నింగ్ మాత్రమే కాదు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచి సూర్య దూకుడుగానే ఆడుతున్నాడు. ప్రధానంగా ఆరంగేట్రం మ్యాచ్ లో మొదటి బంతినే సిక్స్ బాది తనకు ఎలాంటి భయంలేదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోని సూర్య సంచలన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్ పర్యటన తరువాత క్రికెట్ కు బ్రేక్ ఇచ్చిన సూర్య మళ్లీ బ్యాట్ పట్టాడు. రంజీ ట్రోపీలో 2022-23 సీజన్ లో బరిలోకి దిగిన అతను హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు. 

Advertisement

Also Read :  ఈ 10 మంది టాలీవుడ్ స్టార్ల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా…?

Manam News

ముఖ్యంగా జట్టు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ పిచ్ ఎలా ఉన్నా ఎదురుగా ఎం తురుమ్ ఖాన్ బౌలర్ ఉన్నా సూర్య ఆటలో మార్పుండదు. దీనికి తోడు తనపై వచ్చే విమర్శలు, ప్రశంసలు సూర్యను ఏ మాత్రం ప్రభావితం చేయవు. అందుకే అతను ఏ మాత్రం ఒత్తిడి, టెన్షన్, భయం లేకుండా బ్యాటింగ్ చేయగలడు. సూర్యకుమార్ సక్సెస్ కి ప్రధాన కారణం అతని భార్య పెట్టిన కఠిన రూలే అంట. ఆ రూల్ ఏంటంటే.. మ్యాచ్ కి చాలా సమయం ముందే సూర్యకుమార్ యాదవ్ ఫోన్ ని అతని భార్య దేవిషా శెట్టి తీసుకొని దగ్గర పెట్టుకుంటుంది. దీంతో ఇతర విషయాల గురించి ఆలోచించకుండా సూర్య మ్యాచ్ పైనే ఫోకస్ పెట్టేశాడు. మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు గేమ్ ప్లాన్ ఏంటి..? పిచ్ ఎలా ఉంది..? తనపై ఎలాంటి అంచనాలు ఉన్నాయా..? ఇలాంటి విషయాలు ఏవి సూర్యకు తెలిసే అవకాశం లేకుండా చేయడంతో.. అతడు ప్రెష్ మైండ్ తో బరిలోకి దిగి అద్భుతమైన ప్రదర్శన కనబరుచుతున్నట్టు తెలుస్తోంది. 

Also Read :  క్రికెట్ గ్రౌండ్ లో సిక్సర్ల తుఫాను సృష్టించిన తన్మయ్ సింగ్..!

Visitors Are Also Reading