Home » ఢీ షోకి మళ్ళీ సుధీర్.. ఎప్పుడంటే..?

ఢీ షోకి మళ్ళీ సుధీర్.. ఎప్పుడంటే..?

by Azhar
Ad

జబర్దస్త్ అనే ప్రోగ్రాం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షోకు రావడానికి కంటే ముందు కనీసం వారు ఎవరో కూడా తెలియని వారు ఇప్పుడు సెలబ్రెటీలు అయ్యారు. అయితే షో నుండి ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి వస్తే… జబర్దస్త్ నుండి టాలీవుడ్ కు హీరోగా వచ్చిన మొదటి వ్యక్తి సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కు రాకముందు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్ ఇప్పుడు ఓ పాపులర్ సెలబ్రెటీ.

Advertisement

జబర్దస్త్ లో టీం లీడర్ గా చేస్తున్న సుధీర్.. ఆ తర్వాత ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది. అందులో సుధీర్, రష్మీ, ప్రదీప్ చేసే కామెడీ మాములుగా ఉండదు. దాదాపు 4 సీజన్లు ఢీ షోలో కనిపించిన సుధీర్.. తాజాగా జరుగుతున్న సీజన్ లో మాత్రం లేడు. దాంతో సుధీర్ ఈ షో ఎందుకు మానేసాడు అనే ప్రశ్న ఆయన అభిమానులను తొలిచివేసింది. బిజీ షెడ్యూ కారణంగానే తాను ఢీ మానేసాను అని సుధీయే చెప్పారు.

Advertisement

అయిన కూడా ఆభిమానులు ఈ ప్రశ్నను వదలలేదు. ఎందుకంటే… ఢీ మానేసిన సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త షోలో యాంకర్ గా చేరారు. మరి అంత బిజీ షెడ్యూల్ లో ఇది ఎలా చేస్తున్నారు అని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అభిమనులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సుధీర్.. ఢీ షో మానేయడం పై స్పందిస్తూ… నేను ఢీషో ను మానేయలేదు. కేవలం కొంత గ్యాప్ ఇచ్చాను అంతే. నేను మళ్ళీ ఢీ షో లో కనిపిస్తాను అని ప్రకటించారు. దాంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిపోయారు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!

ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!

Visitors Are Also Reading