Home » బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!

బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!

by Azhar
Ad

బీసీసీఐని ప్రపంచంలోని అన్ని క్రికెట్ బోర్డుల కంటే ధనిక బోర్డుగా.. బలమైన నిలిపింది ఏదంటే ఐపీఎల్ అనే చెప్పాలి. కేవలం డబ్బు పరంగానే కాకుండా టాలెంట్ పరంగా కూడా ఐపీఎల్ బీసీసీఐకి ఎంతో దోహద పడింది. ఐపీఎల్ నుండి ఎంతో మంది ఆటగాళ్లకు భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు. 2008 లో ప్రారంభించిన ఐపీఎల్ చాలా విజయవంతం కావడంతో ప్రతి ఏడాది దాని వ్యాల్యూ పెరుగుతూ వచ్చింది. బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ అలాగే యాడ్స్ కూడా విపరీతంగా వచ్చాయి.

Advertisement

అయితే 2018 నుండి 2022 వరకు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ను 16 వేల కోట్లకు పైగా చెల్లించి మరి దకించుకున్న స్టార్ స్పోర్ట్స్ దానిని బాగా క్యాష్ చేసుకుంది. మ్యాచ్ మధ్యలో వచ్చే సెకండ్ల యాడ్స్ కూడా కోట్లలో వసూల్ చేసింది. ఇక కరోనా సమయంలో కూడా గత రెండేళ్లు బీసీసీఐ ఐపీఎల్ ను విజయవంతంగా నడిపింది. దానికి తోడు ఈ రెండేళ్లలో వ్యూవర్ షిప్ కూడా బాగా పెరింది. దాంతో ఈ ఐపీఎల్ 2022 పైన కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇంకా రెండు కొత్త జట్లు రావడంతో వ్యూవర్ షిప్ ఇంకా పెరుగుతుంది అని భావించి స్టార్ స్పోర్ట్స్ యాడ్స్ రేట్ కూడా భారీగా పెంచింది.’

Advertisement

కానీ ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఈ ఐపీఎల్ 2022 వ్యూవర్ షిప్ భారీగా పడిపోయింది. ఈ సీజన్ ముగింపు దశకు వచ్చిన వ్యూవర్ షిప్ మాత్రం పెరగడం లేదు. దాంతో యాడ్స్ కు అధిక మొత్తం వెచ్చించిన కంపెనీలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలోకి బీసీసీఐని లాగుతున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇక వ్యూవర్ షిప్ పెరుగుతుంది అని ఆ కంపెనీలకు చెబుతుంది. చూడాలి మరి ఈ విషయం చివరికి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!

ఐపీఎల్ 2022కు జడేజా గుడ్ బై…?

Visitors Are Also Reading