Home » “బలగం” సినిమాలో ప్రియదర్శి పాత్రను వదులుకున్న స్టార్ కమెడియన్!

“బలగం” సినిమాలో ప్రియదర్శి పాత్రను వదులుకున్న స్టార్ కమెడియన్!

by Bunty
Published: Last Updated on
Ad

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమైన వేణు జబర్దస్త్ షోలో తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. వేణు బలగం సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరోగా ప్రియదర్శి, హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. చాలా సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా నటించిన ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

READ ALSO : Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

Advertisement

Advertisement

బలగం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమా గతవారం నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉండగా, బలగం సినిమాలో అన్ని పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ప్రియదర్శి చేసిన సాయిలు పాత్ర కీలక క్లైమాక్స్ లో ప్రియదర్శి నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి సాయిలు పాత్రకు ముందుగా ప్రియదర్శిని అనుకోలేదట.

READ ALSO :  TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

Recent blockbuster Balagam out on OTT

డైరెక్టర్ వేణు బలగం స్టోరీని దిల్ రాజుకు చెప్పిన సమయంలో సాయిలు పాత్రను వేణునే చేయాలని అనుకున్నారట. కానీ తర్వాత ఇతర నటుడిని తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రియదర్శి పేరును దిల్ రాజు సూచించారట. అలా సాయిలు పాత్ర తన వరకు వచ్చిందని స్వయంగా ప్రియదర్శి చెప్పాడు. ఒకవేళ వేణునే సాయిలు పాత్ర చేసి ఉంటే ఒక మంచి సినిమాలో తాను భాగం అయ్యే వాడిని కాదని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.

READ ALSO : Honey Rose : లేటు వయస్సులో పెళ్లికి సిద్ధమైన బాలయ్య బ్యూటీ…వరుడు ఎవరంటే?

Visitors Are Also Reading