Home » ఆ మూడింటిని వారికి ఇవ్వండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రీలీలా..!!

ఆ మూడింటిని వారికి ఇవ్వండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రీలీలా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ హీరోయిన్ శ్రీలీల పేరు మార్మోగిపోతోంది. ఇండస్ట్రీ స్టార్ హీరోలతో ఆమె సినిమా ఛాన్స్ లు కొట్టేస్తూ ముందుకు దూసుకుపోతోంది.. అలాంటిశ్రీలీలా సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా మంచి మనసు చాటుకునే అమ్మాయిగా పేరు తెచ్చుకుంటుంది.. వీకెండ్ లో శ్రీ లీల ఓ అనాధ శరణాలయాన్ని సందర్శించి అక్కడ చిన్నారులతో విలువైన సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు.. మీకు వీలు కుదిరినప్పుడు ఇలాంటి చిన్నారులతో గడపండి అంటూ కోరారు.

also read:బిగ్ బాస్ దివి గురించి ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు…ఏం చ‌దువుకుందంటే.?

Advertisement

గొప్ప కళలతో ఉన్న నా చిన్న సమూహం. గొప్ప మనసుతో ఉన్న నా చిన్నారులు, వారు ఎంత గొప్పవారో.. కలిసే వరకు మీకు తెలియదు.కలలు,కథలు,డాన్స్, పాటలు,ఒకరికొకరు ప్రేమను పంచుకోవడం ఇలా రోజంతా ఆనందంగా గడిపాను. వారందరికీ ప్రేమను పంచాలని అక్కడికి వెళ్లాను. వారి యొక్క అమాయక చూపులు చూసి నేను చలించి పోయాను. ఇలాంటి క్షణాలను అనుభూతి చెందాలని ప్రతి ఒక్కరికి ఉంటుందని నాకు తెలుసు. ఇప్పుడు ఇది అందరికీ సాధ్యమవుతుంది. చాలామంది ఇతరులకు సహాయం చేయాలని చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. కాకపోతే ఎలా చేయాలనేది తెలియదు.

Advertisement

also read:నాగార్జున “సూప‌ర్” సినిమా హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా.?

గూగుల్లో సెర్చ్ చేసి మీ చుట్టూ ఉన్న ఎంతో మంది ఇలాంటి చిన్నారులను కలుసుకోవచ్చు. ఈ పోస్ట్ పెట్టి భారీ విరాళాలు ఇవ్వమని నేను కోరుకోవడం లేదు.కానీ మీ జీవితంలో ఎంతో విలువైన టైమును, ప్రేమ, ఆప్యాయతలు ఇవ్వాలని కోరుతున్నాను.వీటినే వాళ్ళు కోరుకునేది వారం లేదా నెలకు ఒక్కసారైనా వాళ్లతో కలిసి భోజనం చేయండి. దానివల్ల కేవలం కడుపు మాత్రమే నిండదు ఆనందంతో హృదయం కూడా నిండిపోతుంది. ఆ మనసుతోనే #Hereforyou ని మొదలు పెడుతున్న.. ఏదైనా అనాధాశ్రమాన్ని మీరు సందర్శిస్తే.. ఫోటోలు తీసుకొని #Hereforyou అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసి షేర్ చేయండి అంటూ శ్రీ లీల పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ కు విపరీతమైన స్పందన వస్తోంది.

also read:

Visitors Are Also Reading