Home » బిగ్ బాస్ దివి గురించి ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు…ఏం చ‌దువుకుందంటే.?

బిగ్ బాస్ దివి గురించి ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు…ఏం చ‌దువుకుందంటే.?

by AJAY
Ad

బిగ్ బాస్ దివి అంటే తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన దివి అందచందాల‌తో ఆక‌ట్టుకుంది. అందం తో పాటూ అభిన‌యం ఉండ‌టంతో సినిమా ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు రాక‌ముందే మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమాలో ఆఫ‌ర్ ఇస్తాన‌ని చెప్పారు. అంతే కాకుండా ముందుగా మాటిచ్చిన‌ట్టే త‌న గాఢ్ ఫాద‌ర్ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించే ఛాన్స్ ఇచ్చారు.

ALSO READ : షారూఖ్ ఖాన్ సినిమాలో  రామ్ చరణ్.. ఆ పాత్రలో ?

Advertisement

ఇక ఇండ‌స్ట్రీలో చాలా మంది న‌టీమ‌నులు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందినవారే కానీ దివి అచ్చ‌తెలుగమ్మాయి. తెలుగు అమ్మాయిలు ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ మంది ఉండ‌గా అందులో దివి ఒక‌రు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలోనూ దివి త‌న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల‌ను పెంచుకుంటోంది.

ALSO READ : అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!

Advertisement

ఇదిలా ఉంటే దివి గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యాలు ఉన్నాయి. దివి తల్లిదండ్రులు కూడా తెలుగు వారే. అంతే కాకుండా దివి త‌ల్లి మ‌రియు ఆమె సోద‌రుడు ఇద్ద‌రూ కూడా వైద్యులే. ఇక దివి ఎంటెక్ పూర్తి చేసింది. ఆ త‌ర‌వాత మాడలింగ్ వైపు అడుగులు వేసింది.

చ‌దువుకుంటున్న రోజుల్లోనే మాడ‌లింగ్ ద్వారా పాకెట్ మ‌నీని సంపాదించుకుంది. చిన్న‌నాటి నుండే సినిమాల పై ఆస‌క్తి ఉండ‌టంతో మాడ‌లింగ్ వైపు అడుగులు వేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర‌వాత సినిమాలు వెబ్ సిరీస్ ల‌లో న‌టించ‌డంతో పాటూ ఐట‌మ్ సాంగ్ ల‌కు సైతం స్టెప్పులు వేసింది. దివి మొద‌ట‌గా మ‌హేశ్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమాలో మెర‌వ‌గా ఆ సినిమా ద్వారానే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్ ను ద‌క్కించుకుంది.

also read :అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!

Visitors Are Also Reading