Home » ఫుల్ బిజీగా ధమాకా బ్యూటీ…ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే….?

ఫుల్ బిజీగా ధమాకా బ్యూటీ…ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే….?

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ లలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల టాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం మరియు డ్యాన్సులతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ముంబై బ్యూటీ వరుస ఆఫర్ లను అందుకుంటుంది. రీసెంట్ గా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో శ్రీ లీల నటిస్తోంది.

 ALSO REAd : టిడిపి బిగ్ స్కెచ్.. మంత్రి రోజాపై పోటీకి అలేఖ్య రెడ్డి రెడీ ?

Advertisement

ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. అవి ఏవో ఇప్పుడు చూద్దాం…. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 28లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా బాలకృష్ణ 108 సినిమాలో బాలకృష్ణకు కూతురిగా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది.

Sreeleela

Advertisement

ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా శ్రీలీల ను ఎంపిక చేశారు. అంతేకాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న నితిన్ 32వ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారు. వీటితోపాటు నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలోను ఈ బ్యూటీ నే హీరోయిన్ గా తీసుకున్నారు.

మరోవైపు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమాలో కూడా ఈ అమ్మడిని హీరోయిన్ గా ఎంపికచేశారు. వీటితోపాటు కిరీటి హీరోగా నటిస్తున్న జూనియర్ అనే సినిమాలో సైతం శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోను శ్రీలీల ను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also read : రామ్ చ‌ర‌ణ్ కంటే ముందు “మ‌గ‌ధీర” క‌థ‌ ఎవ‌రి వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా..?

Also read : చిరంజీవిని ఫాలో అవుతున్న బాలయ్య….ఏ విషయం లో అంటే…?

 

Visitors Are Also Reading