మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను ఇండస్ట్రీలో స్టార్ గా నిలబెట్టిన సినిమా మగధీర. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కానీ ఈ సినిమా అనుకున్నమేర విజయ సాధించలేకపోయింది.
కానీ ఆ తరవాత రామ్ చరణ్ వద్దకు దర్శకధీరుడు రాజమౌళి వచ్చి మగధీర సినిమాను తెరకెక్చించారు. ఈ చిత్రం వందరోజులకు పైగా ఆడటంతో పాటు కలెక్షన్ ల వర్షం కురింపించింది. ఈ సినిమాతోనే చరణ్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
also read : ఎస్వీ కృష్ణా రెడ్డి హీరోయిన్లకు వెండి పల్లెం పట్టుచీరలు ఎందుకు ఇస్తారా తెలుసా..?
Magadheera
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజమౌళికి చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ఉండేదని అన్నారు.
chiranjeevi
అయితే అదే సమయంలో చిరంజీవి నుండి తమకు ఫోన్ వచ్చిందని తనతో సినిమా చేయాలని ఆయనే చెప్పారని అన్నారు. అలా చిరంజీవి కోసం మగధీర కథను సిద్దం చేశామని చెప్పారు. వంద మందితో ఫైట్ సీన్ ను కూడా ఆయనకు వివరించామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల మెగాస్టార్ తో సినిమా చేయడం కుదరలేదని అన్నారు.
అయితే ఆ కథతో వేరేవాళ్లతో సినిమా చేయడానికి రాజమౌళి ఒప్పుకోలేదని అన్నారు. చివరికి అదే కథతో రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమా చేసే అవకాశం వచ్చిందని అన్నారు. మెగావారసత్వం వల్లే రామ్ చరణ్ ఈ సినిమాకు సెట్ అయ్యారని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉంది.