Home » చిరంజీవిని ఫాలో అవుతున్న బాలయ్య….ఏ విషయం లో అంటే…?

చిరంజీవిని ఫాలో అవుతున్న బాలయ్య….ఏ విషయం లో అంటే…?

by AJAY
Ad

ప్రస్తుతం సీనియర్ హీరోలు బాలకృష్ణ చిరంజీవి కుర్ర హీరోలకు సైతం పోటీని ఇస్తున్నారు. ఇద్దరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదేవిధంగా ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురిసింది. అంతేకాకుండా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సైతం భారీగా వసూళ్లు వచ్చాయి.

Advertisement

అంతేకాకుండా ఈ ఇద్దరు హీరోలు సైతం రొటీన్ సినిమాలు కాకుండా విభిన్న సినిమాల్లో నటించేందుకు ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాల్లోనూ కొత్తధనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా చిరంజీవి బాలకృష్ణ ల తదుపరి సినిమాలకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం బోలా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాకు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం చిరంజీవి నటించిన “చూడాలని ఉంది” సినిమాలోని రామ చిలకమ్మ…… పాటను రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు శృతిహాసన్ తో కలిసి తన సినిమాలోని ఓ ఓల్డ్ పాటకు మెగాస్టార్ స్టెప్పులు వేశాడు. ఆ సీన్ కు ఫ్యాన్స్ ఫిదా అవడంతో ఇప్పుడు ఏకంగా సొంత పాటనే బోలా శంకర్ సినిమా కోసం రీమిక్స్ చేయాలని చూస్తున్నారు.

అయితే ఒక హీరో తన పాటని రీమిక్స్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా బాలకృష్ణ తదుపరి సినిమా ఎన్.బి.కె 108 లో కూడా బాలయ్య పాత సినిమాలోని పాటను రీమిక్స్ చేయబోతున్నారట. బాలకృష్ణ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమా సమరసింహారెడ్డిలోని…. అందాల ఆట బొమ్మ….. పాట అప్పట్లో చార్ట్ బస్టర్ అయింది. ఇక ఈ పాటను బాలయ్య 108 లో రీమిక్స్ చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దాంతో ఈ పాట పై సైతం అంచనాలు పెరిగిపోయాయి.

Also read : Samantha: సమంత చేతులకు గాయాలు.. రక్తంతో షాకింగ్ పోస్ట్

Visitors Are Also Reading