Home » Sr.NTR కు ఆ హీరోయిన్ తో ఎఫైర్..కానీ ఎన్టీఆర్ ఇచ్చిన ట్విస్టుతో అంతా సైలెంట్..!!

Sr.NTR కు ఆ హీరోయిన్ తో ఎఫైర్..కానీ ఎన్టీఆర్ ఇచ్చిన ట్విస్టుతో అంతా సైలెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సున్నితంగా ఉండే వ్యక్తులు సినీ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాము అంటేనే అందం, నటన,టాలెంట్ తో పాటుగా కాస్త ధైర్యం కూడా ఉండాలి. ఇండస్ట్రీలోకి వచ్చి కాస్త పేరు ప్రఖ్యాతలు రాగానే మనపై లేనిపోని మచ్చలు మరకలు పడుతూ ఉంటాయి.. ఇందులో ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్లు అయితే మరీ ఎక్కువ. వారు ఎవరితో మాట్లాడిన, కాస్త క్లోజ్ గా మూవ్ అయిన, వారితో ఫోటోలు దిగినా ఏదో ఒకటి అంటగట్టి రూమర్ల తో ఏకిపారేస్తారు.. అలాంటివి ఇప్పుడే కాదు సీనియర్ ఎన్టీఆర్ టైంలో కూడా ఉండేవి.. వీటిలో వారు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా కష్టమే.

Advertisement

also read:పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఆర్జీవీ సినిమా ?

Advertisement

కానీ అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకునే వారని ఆయన దగ్గరుండి చూసినవారు చెబుతుంటే తెలిసింది. ఎన్టీఆర్ 22 సంవత్సరాల వయసులోనే సిని రంగం లోకి అడుగుపెట్టారు. 26 ఏళ్ల కు వచ్చేసరికి స్టార్ హీరోగా మారిపోయారు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నైజాం ఎన్టీఆర్ ది .. ఆయన నటనతో అభిమానులకు దేవుడు అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు చాలా ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో హీరోయిన్ సావిత్రి అన్నగారికి ఏదో సంబంధం ఉందంటూ తమిళ పేపర్లు రాశాయి. ఇది ఆయనకు తెలిసిన వెంటనే ఖండించారు.. ఈ వివాదాలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భావించి ఒక అగ్ర నిర్మాత దగ్గర లక్ష రూపాయలు అప్పు చేసి చెన్నైలో ఇల్లు కొన్నారు. వెంటనే తన భార్య బసవతారకం ని అక్కడికి తీసుకు వెళ్లి కాపురం పెట్టారు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండే ఎన్టీఆర్ కొత్త ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమాన్ని మాత్రం చాలా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైలోని పత్రికాధిపతులందరినీ ఆహ్వానించారు.

తనపై ఎవరైతే రూమర్లు రాసారో ఆ పత్రిక వాళ్లను కూడా ఆహ్వానించారు. దీంతోపాటుగా ఈ ఫంక్షన్ కి మహానటి సావిత్రి ని కూడా పిలిచారు.. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సావిత్రి, నేను చాలా సినిమాల్లో నటింఛామని, అయినా కూడా ఆమె నా సోదరి వంటిదని అన్నారు. ఈరోజు నా కొత్త ఇంట్లో పాలు పొంగించింది కూడా ఆమేనని తెలిపారు. ఇక అప్పటి నుంచి ఆయన మీద ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడిందని, గుమ్మడి తను రాసుకున్న పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

also read:

Visitors Are Also Reading