Home » Temba Bavuma : హే బాబు లే… బవుమాపై ట్రోలింగ్ !

Temba Bavuma : హే బాబు లే… బవుమాపై ట్రోలింగ్ !

by Bunty

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఇవ్వాల్టి నుంచి ప్రారంభం అయింది. ఇవాల్టి నుంచి దాదాపు 40 రోజులపాటు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ తరుణంలోనే… ప్రెస్ మీట్ లో అన్ని జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ పంచుల వర్షం కురిపించారు. మ్యాచులకి ముందు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు చాలా ఫన్నీగా సమాధానాలు ఇస్తాడు రోహిత్ శర్మ. ఇప్పుడు వరల్డ్ కప్ ముందు కెప్టెన్స్ కార్నర్ అని ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు.

South Africa Skipper Temba Bavuma's Clear Reply After 'Sleeping' Picture Goes Viral

South Africa Skipper Temba Bavuma’s Clear Reply After ‘Sleeping’ Picture Goes Viral

అక్కడికి కెప్టెన్స్ అందరూ హాజరయ్యారు. అక్కడ ఓ రిపోర్టర్ రోహిత్ శర్మను 2019 ప్రపంచకప్ ఫైనల్ గురించి ఓ ప్రశ్న అడిగాడు. లాస్ట్ టైం ఏం జరిగిందోగిందో గుర్తుంది కదా… ఫైనల్ టై అవడం, ఆ తర్వాత రిజల్ట్ తేల్చడం కోసం పెట్టిన సూపర్ ఓవర్ కూడా టై అవడం, బౌండరీ ల కౌంట్ ద్వారా విజేతను నిర్ణయించడం ఇలా పెద్ద కాంట్రవర్సీ అయింది. దీని గురించే ఓ రిపోర్టర్ రోహిత్ ను అడిగాడు. గతసారి ఇద్దరినీ విన్నర్స్ గా అనౌన్స్ చేయాల్సిందా అని ఆ రిపోర్టర్ రోహిత్ ను అడిగాడు. దానికి రోహిత్ తనదైన ముంబై స్లాంగ్ లో క్యా యార్ అన్నాడు.

విన్నర్ ను అనౌన్స్ చేయడం తన పని కాదని ఆ తర్వాత అన్నాడు. ఇక అంతే ఆ రూమంతా నవ్వులతో నిండిపోయింది. దీనికి కొనసాగింపుగా ఇంకొకటి జరిగింది. అప్పుడు వరల్డ్ కప్ విన్నింగ్ సభ్యుడైన జోస్ బట్లర్ ఈసారి ఇంగ్లాండ్ కెప్టెన్. ఇతను ఇదే ఈవెంట్లో పాల్గొన్నాడు. హిందీ తెలిసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పక్కన కూర్చున్నాడు. రోహిత్ వేసిన జోక్ ఏంటంటూ బాబర్ ను అడిగి బట్లర్ తెలుసుకున్నాడు. ఇక అటు సౌత్ఆఫ్రికా కెప్టెన్ బవుమా కెప్టెన్ల ప్రెస్ మీట్ లో నిద్రపోతూ కనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. హే బాబు లే అంటూ dj tillu సినిమా డైలాగులు ఉపయోగించి ట్రొలింగ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading