Home » కరోనా పాజిటివ్ తో కూడా మ్యాచ్ ఆడొచ్చు అంటున్న ఐసీసీ..!

కరోనా పాజిటివ్ తో కూడా మ్యాచ్ ఆడొచ్చు అంటున్న ఐసీసీ..!

by Azhar
Ad

చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని ఏ విధంగా వణికించిందో అందరికి తెలుసు. దాదాపుగా అయారు నెలలకు పైగా ఈ వైరస్ వల్ల ప్రపంచం ఎక్కడికి అక్కడ ఆగిపోయింది. ఇక క్రికెట్ మ్యాచ్ లు కూడా జరగలేదు అనేది తెలిసిందే. 2020 లో జరగాల్సిన ప్రపంచ కప్ అనేది వాయిదా పడి ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది.

Advertisement

అయితే ఈ ప్రపంచ కప్ కు కరోనా సెగ అనేది అంతగా లేదు అనేది తెలిసిందే. కరోనా తర్వాత క్రికెట్ ప్రారంభమైన వెంటనే.. ప్రతి మ్యాచ్ కు కరోనా పరీక్షలు నిర్వహించేవారు. అలాగే ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ కు పంపించేవారు. అలాగే ఆటగాళ్లు బయో బబుల్ లో ఉంచి క్రికెట్ ఆడించేవారు. కానీ ఇప్పుడు ఆ కరోనాను ప్రపంచం చూసే విధానం అనేది మారిపోయింది.

Advertisement

అందుకే ఈ ప్రపంచ కప్ లో కూడా ఐసీసీ కొన్ని కొత్త నియమాలు తెచ్చింది. అవేంటంటే.. ఇప్పుడు ఆటగాళ్లకు కరోనా ఉన్న కూడా మ్యాచ్ లు అనేవి ఆడవచ్చు అని తెలుపుతుంది. అయితే ఏ ఆటగాడికి అయిన కరోనా సోకితే.. అతను తప్పకుండ ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన పని అనేది లేదు. ఇక కరోనా వచ్చి లక్షణాలు అనేవి లేకుంటే మాత్రం.. డాక్టర్ సూచనల మేరకు ఆ ప్లేయర్ మ్యాచ్ అనేది ఆడవచ్చు అని ఐసీసీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

గంగూలీని దెబ్బ కొట్టింది సీఎస్కే ఓనరా…?

సారాతో ఒక్కే హోటల్ లో గిల్..!

Visitors Are Also Reading