Home » ఆ స్టార్ హీరోయిన్ మరణ వార్త విని తాను చనిపోవాలనుకున్న జగపతిబాబు.. జరిగింది ఏంటంటే..?

ఆ స్టార్ హీరోయిన్ మరణ వార్త విని తాను చనిపోవాలనుకున్న జగపతిబాబు.. జరిగింది ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా పోటీపడి పారితోషకం తీసుకునే బిజీ హీరోయిన్ అందాల రాశి సౌందర్య.. ఈమె నటనా సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది స్టార్ హీరోలతో జతకట్టింది. సౌందర్య చూడటానికి అచ్చ తెలుగు అమ్మాయిలా తన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.ఎంత తొందరగా ఇండస్ట్రీలో స్టార్ హోదా కు వెళ్లిందో అంతే త్వరగా తెర మరుగయిపోయింది. కానరాని లోకాలకు వెళ్లిపోయింది.. మరి అలాంటి సౌందర్య హీరో జగపతిబాబు కాంబోలో అనేక సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

Advertisement

also read:ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో గుర్తు పట్టారా..? ఇటీవలే దెయ్యం పాత్రలో భయపెట్టింది..!

Advertisement

ఇదిలా ఉండగా సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగపతిబాబు అంత పెద్ద స్టార్ అవుతారని అనుకోలేదు.. హీరోగా చేసిన వ్యక్తులు మళ్లీ విలన్ గా చేయడం అనేది మామూలు విషయం కాదనీ అన్నారు. మరీ ముఖ్యంగా జగపతిబాబు చాలా మంచి వారని ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయనకు ఉందని అన్నారు. అంతేకాకుండా జగపతిబాబు షూటింగ్స్ కి వారి బంధువులు స్నేహితులు ఎవరైనా వస్తే తన సొంత డబ్బులతో వారికి ఖర్చు చేసే వారిని అన్నారు. ప్రొడ్యూసర్లపై భారం వేయకుండా ఆలోచించేవారని తెలియజేశారు..

ఇక ఇండస్ట్రీలో జగపతిబాబు మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సౌందర్య అన్నారు రామారావు. అయితే సౌందర్య అకస్మాత్తుగా విమాన ప్రమాదంలో మరణించడం ఈ మరణ వార్త తెలిసిన జగపతిబాబు కూడా చనిపోవాలనుకున్నారని ఈ విషయాన్ని జగపతిబాబే ఒక సందర్భంలో తెలియజేశారని అన్నారు. సౌందర్య లాంటి మంచి స్నేహితురాలు చనిపోయిన తర్వాత నేనెందుకు ప్రాణాలతో ఉండాలనిపించింది అని అన్నారట. ఏది ఏమైనా జగపతిబాబు మంచి నటుడు. ప్రస్తుతం సినిమాలలో విలన్ గా నటిస్తూ అనేక ఆఫర్లు అందుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

also read:

Visitors Are Also Reading