Home » ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో గుర్తు పట్టారా..? ఇటీవలే దెయ్యం పాత్రలో భయపెట్టింది..!

ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో గుర్తు పట్టారా..? ఇటీవలే దెయ్యం పాత్రలో భయపెట్టింది..!

by Anji
Ad

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా స్టార్ హీరో, హీరోయిన్స్ కి సంబంధించిన బాల్యం నాటి ఫోటోలు, పాత ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

ఇక ఈ ఫోటోలో చిన్నప్పుడు ఓ స్టార్  హీరోయిన్ రెండు జడలు వేసుకొని క్యూట్ స్మైల్ ఇస్తుంది. అంతేకాదు.. మరో స్టార్ హీరోకి సతీమణి కూడా. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. అయితే తెలుగులో కూడా ఈమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దక్షిణాదిన సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మరెవ్వరో కాదండోయ్.. బాలీవుడ్ సొగసుల సుందరి కత్రినా కైఫ్. మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది నెలల కిందటే హీరో విక్కి కౌశల్ తో పెళ్లి జరిగింది. 

Advertisement

Also Read : THODELU MOVIE REVIEW : ‘తోడేలు’ సినిమా ఎలా ఉందంటే..?

వెడ్డింగ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే సినిమా షూటింగ్ లకు హాజరైంది. తాజాగా ఫోన్ బూత్ అనే సూపర్ న్యాచురల్ కామెడీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఆమె దెయ్యం పాత్రలో నటించి అందరినీ భయపెట్టింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాని చూసిన ఈ సొగసరి మళ్లీ దక్షిణాది సినిమాల్లో నటించాలనే కోరికను వెల్లడించింది. అందుకు తగ్గటే విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్ అనే సినిమాకి కమిట్ అయింది. ఇప్పటికే షూటింగ్ కూడా జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే ఓ అప్ డేట్ రానుంది. అదేవిధంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ 3 సినిమాలో కూడా నటిస్తోంది కత్రినా కైఫ్. 

Also Read :   హీరోయిన్ జమున ఆ స్టార్ హీరో వల్లే 45 ఏళ్లుగా వ్యాధితో బాధపడుతోందా..?

Visitors Are Also Reading