Home » ఆ హీరోయిన్ తో నాగ‌చైత‌న్య డేటింగ్ …? నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

ఆ హీరోయిన్ తో నాగ‌చైత‌న్య డేటింగ్ …? నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

by AJAY
Ad

సమంత నాగచైతన్య విడాకుల తర్వాత వారి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా నాగచైతన్యకు పలువురు హీరోయిన్లతో సంబంధం ఉంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైతూకు మొద‌ట సాయిప‌ల్ల‌వితో ల‌వ్ ట్రాక్ ఉంది అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

Advertisement

అంతే కాకుండా ఆ త‌ర‌వాత రాశిక‌న్నాతో చైతూ ల‌వ్ లో ఉన్నాడంటూ గుస‌గుస‌లు వినిపించాయి. ఆ వార్త‌ల‌కు చెక్ ప‌డింది. కాగా నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత కొద్ది రోజులకే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను శోభిత దూళిపాళ్ల ఖండించారు.

Advertisement

శోభితా అడవి శేషు హీరోగా నటించిన మేజర్ సినిమాలో హీరోయిన్ గా న‌టించి టాలీవుడ్ కు పరిచయమయ్యారు. కాగా తాజాగా మరోసారి శోభిత నాగచైతన్య ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజ‌న్లు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో లాల్ సింగ్ చ‌ద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతూ ను యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.

మీకు శోభిత ధూళిపాళ్ల పేరు వింటే ఏం గుర్తొస్తుందని అని ప్రశ్నించగా…. నాగచైతన్య నవ్వేసి సమాధానం దాటవేశారు. అంతేకాకుండా ఇప్పుడు మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అనగా.. హ్యాపీ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడేమో శోభితతో నాగచైతన్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading