సాధారణంగా పెళ్లి జరిగిన సమయంలో భార్య, భర్తలు కొద్ది రోజుల పాటు సంతోషంగానే ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్ది చిన్న చిన్న తగాదాలు రావడం భార్య పుట్టింటికి వెళ్లడం ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందుప్రియురాలు ధర్నా చేపట్టిన సంఘటనలు చాలానే చూస్తుంటాం.
Also Read : తెలంగాణలో ఇంటర్ తరగతులు ఎప్పటి నుంచి అంటే ?
Advertisement
మరోవైపు మెట్టినింటి వారి ఇబ్బందులు తాళలేక కోడళ్లు అత్తగారింటి ఎదుట ధర్నా చేయడం తరచూ వార్తల్లో వింటుంటాం. కానీ ఓ అల్లుడు అత్తగారింటి వద్ద ధర్నా చేసిన విచిత్రమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు తనను వేధిస్తున్నారని అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగాడు. ఈ ఘటన సూర్య పేట జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణి దంపతులు. భార్య, భర్తల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా వీరు విడివిడిగా ఉంటున్నారు.
Advertisement
బాబును తల్లిదండ్రుల చెంతనే ఉంచి రమణీ కెనడా వెళ్లింది. వారం కుమారుడిని చూడడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని ప్రవీణ్ తన కొడుకును చూసేందుకు రావడంతో.. అత్తమామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసేందుకు అత్తమామ కుట్ర చేస్తున్నారని ప్రవీన్ తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : యూట్యూబర్ల గ్రామం ఎక్కడ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!