Home » తెలంగాణలో ఇంటర్ తరగతులు ఎప్పటి నుంచి అంటే ?

తెలంగాణలో ఇంటర్ తరగతులు ఎప్పటి నుంచి అంటే ?

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన క్యాలెండర్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. జూన్ 01 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 365 రోజుల్లో 77 సెలవులు తప్ప 227 రోజులు క్లాసులు జరిగే విధంగా ప్లాన్ చేశారు. వార్షిక పరీక్షలకు 2024 మార్చిలో జరుగనున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. 

Also Read :  ఆవు పాలు, గేదె పాలలో ఏది ఆరోగ్యానికి మంచిది…?

Advertisement

 

 

ఏప్రిల్ 01 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు అమలులోకి ఉంటాయని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు విధిగా సెలవులను పాటించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ప్రభుత్వం సెలవులు, ఆదివారాలలో ఎట్టి పరిస్థితిలో కూడా తరగతులు ఏర్పాటు చేయకూడదని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాలలో అడ్మిషన్లను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారమే తీసుకోవాలని సూచించారు.  

Advertisement

Also Read :    రాంచరణ్ డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారా ? సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాసన!

AP Intermediate second year regular classes to begin from August 16  adhering to covid rules

 దసరా పండుగ కు సెలవులు 19-10-2023 నుంచి 25-10-2023 వరకు కొనసాగుతాయి. సంక్రాంతి సెలవులు 13-01-2023 నుంచి 16-01-2023 వరకు, వేసవి సెలవులు 01-04-2024 నుంచి 31-05-2024 వరకు ఉంటాయి. అర్థవార్షిక పరీక్షలు 20-11-2023 నుంచి 25-11-2023 వరకు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 22-01-2024 నుంచి 29-01-2024 వరకు కొనసాగుతాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 2024 ఫిబ్రవరి రెండో వారంలో ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ 2024 మార్చి ఫస్ట్ వారంలో, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 మే చివరి వారం కొనసాగనున్నాయి. 

Also Read :  మస్కిటో కాయిల్ పొగ పీల్చి… ఆరుగురు మృతి… వీటిని వాడటం అంత ప్రమాదమా!

Visitors Are Also Reading