Home » కీరవాణి ఆరోజే రిటైర్ అవుతా అన్నాడు కానీ..!

కీరవాణి ఆరోజే రిటైర్ అవుతా అన్నాడు కానీ..!

by Anji
Ad

తెలుగు సినిమా అంతర్జాతీయ వేదిక మీద ఉంచి తెలుగు సినిమా గౌరవాన్ని, భారతదేశ సినిమా గౌరవాన్ని నిలబెట్టిన ఘనత దర్శకుడు రాజమౌళికే దక్కుతోంది. రాజమౌళి సినిమా అంటే అది ఫ్యామిలీ ప్యాకేజ్ అనే చెప్పాలి. దాదాపు వాళ్ళింట్లో అందరూ సమిష్టిగా కృషి చేసి సినిమాను తీస్తారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తే.. కీరవాణి సంగీతము, కీరవాణి భార్య వల్లి ప్రొడక్షన్, రాజమౌళి భార్య రమ కాస్ట్యూమ్, కీరవాణి కొడుకు కాలభైరవ పాటలు పాడుతారు. రాజమౌళి కొడుకు కార్తీక్ కూడా సినిమాల్లో పని చేస్తున్నారు. ఇలా కుటుంబం మొత్తం పనిచేస్తూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు. రాజమౌళి కీరవాణి తండ్రులు ఇద్దరు సోదరులు. వారిది ఉమ్మడి కుటుంబం. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం గా కీరవాణి రాజమౌళి కుటుంబం ఉంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివశక్తి దత్త అన్నదమ్ములు.

Also Read :  షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాల‌కృష్ణ‌, కృష్ణ‌, కృష్ణంరాజు.. వారు ప్రాణాల‌ను ఎలా కాపాడుకున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక ఉండ‌రు..!

Advertisement

 

సినిమా తీయాలనే కోరికతో చెన్నైకి వచ్చిన శివశక్తి దత్త ఆ అవకాశం రాక ఎంతోకాలం ఎదురుచూశారు. ఆయన వయసు ప్రస్తుతం 91 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ‘తిరుమల నాయక’ అనే సినిమాకు దర్శకుడిగా చేస్తున్నారు. అద్భుతైనటువంటి  ఆర్టిస్టు అయినప్పటికీ ఆయన ఎన్నో పెయింటింగ్స్ వేశారు. ఆయన ఈ వయసులో కూడా చాలా ఫీట్ గా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆయన ఆర్టిస్ట్ అవ్వడమే అని చెబుతున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం గురించి, ఎం.ఎం.కీరవాణి గురించి శివశక్తి దత్త పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవి ఏంటో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా RRR చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి ఓ యాంకర్ శివ శక్తి దత్తను  ప్రశ్నించగా.. ఆయన నాటు నాటు అనేది అసలు పాటనే కాదు.. ఇన్నాళ్లు అతను చేసినటువంటి కృషికి ఈ రూపంలో వచ్చిందని చెప్పాడు. ముఖ్యంగా చంద్రబోస్ రాసినటువంటి 5000 పాటల్లో ఇది ఒక పాట మాత్రమే.  నా దృష్టిలో ఇప్పటివరకు కీరవాణి అందించిన మ్యూజిక్ లలో ఇది ఒక మ్యూజికా..? కానీ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు ప్రేమ్ రక్షిత్. ఈ పాటకు అనుగుణంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా చేసిన స్టెప్పులకు హ్యాట్సాఫ్ చెప్పారు.  రాజమౌళి కాన్సెప్ట్ అదుర్స్.. చంద్రబోస్, కీరవాణి కృషి ఫలితం నాటు నాటు పాట రూపం ద్వారా లభించింది.

Also Read :  రేణుకకి డబ్బు ఆశ.. ప్రవీణ్ కి అమ్మాయిల కోరిక.. కీలక అంశాలు వెలుగులోకి !

“ప్రధానంగా కీరవాణి 27 సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో ఉంటాను అని..  చిన్నప్పుడు అనుకున్నట్టు వెల్లడించారు. 1989 లో అతని  సంకల్పము గురించి చెప్పేపగానే  నేను ఆశ్చర్యపోయాను అని వెల్లడించారు శివ శక్తి దత్త.  కానీ ఆ తర్వాత రాజమౌళి వారు, వీరు, ఎవరు మార్చారో తెలియదు. కానీ నా సర్వాధికారాలు ఉన్నచోట మాత్రమే నేను పని చేస్తాను. నేనిచ్చింది మాత్రమే తీసుకోవాలి. అలాంటి వారికి మాత్రమే నేను చేస్తాను” అని కీరవాణి ఓ అమెండ్మెంట్ పెట్టుకున్నాడు. తమ కుటుంబంలో అందరూ సినిమాల వైపు మళ్లడానికీ తానే కారణమంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా కథలు రాసే విజయేంద్ర ప్రసాద్ ని కూడా తొలుత చెన్నైకి తీసుకెళ్లింది శివ శక్తి దత్తనేనట.  రాజమౌళి ఫ్యామిలీలో ఇంత మంది సినిమాల్లో పని చేస్తున్నారంటే అందుకు కారణం ఈయనే అని చెప్పవచ్చు.

Also Read :  Kabzaa Review Telugu : కబ్జా మూవీ రివ్యూ..మొత్తం KGF ను దించేశాడా ?

Visitors Are Also Reading