Home » రేణుకకి డబ్బు ఆశ.. ప్రవీణ్ కి అమ్మాయిల కోరిక.. కీలక అంశాలు వెలుగులోకి !

రేణుకకి డబ్బు ఆశ.. ప్రవీణ్ కి అమ్మాయిల కోరిక.. కీలక అంశాలు వెలుగులోకి !

by Anji
Ad

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో రోజుకు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దాదాపు 11 మంది అరెస్టు అయ్యారు. టీఎస్ఫీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజ్ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడు మరో వ్యక్తి అరెస్టయ్యారు. ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది. నాలుగు పెన్ డ్రైవ్ లలో దాదాపు 60 నుంచి 70 జీబీ వరకు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.  

Also Read :   పేపర్ లీక్ కోసం గాలం వేసి .. చివరికీ తానే చిక్కుకుంది..!

Advertisement

దర్యాప్తులో భాగంగా కీలక సమాచారం సిట్(Special Investigation Team)  చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. సీజ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్, సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ కి పంపించింది సిట్. ఇప్పటి వరకు ఏఈ సివిల్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్న పత్రాలు మాత్రమే లీకైనట్టు వెల్లడి కాగా.. వెటర్నరీ అసిస్టెంట్, ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ప్రశ్నపత్రాలు టీఎస్పీఎస్సీ నుంచి బయటికి వెళ్లాయనే ఆధారాలు సిట్ కి లభ్యమైనట్టు సమాచారం. ప్రవీణ్, రాజశేఖర్, గురుకుల ఉపాధ్యాయురాలు రేణుకతో సహా 9 మంది నిందితుల నుంచి సేకరించినటువంటి వాంగ్మూలలో వాస్తవాలను దృవీకరించడం సిట్ కి పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. రేణుక, ప్రవీణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  మీరు అతిగా నిద్ర పోతున్నారా.. అయితే ఈ ప్రమాదంలో పడినట్టే ?

Advertisement

మహబూబ్ నగర్ కి చెందిన రేణుక 2011లో ఓపెన్ లో టెన్త్ పరీక్ష రాసి ఆ తరువాత ఇతర కోర్సులను పూర్తి చేసిందట. 2018లో హిందీ పండిట్ గా ఉద్యోగం పొందింది. వనపర్తి జిల్లా బుద్ధారంలోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది. ప్రభుత్వ దరఖాస్తు చేసుకున్న సమయంలో రేణుక టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చేది. వన్ టైమ్ పాస్ వర్డ్ కి సంబంధించిన విషయాల్లో మాట్లాడుతూ.. అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రవీణ్ తో పరిచయాన్ని పెంచుకుంది. ప్రవీణ్ 2017 నుంచి విధుల్లో ఉన్నాడు. ప్రవీణ్ కి అమ్మాయిల బలహీనత ఉన్నదని కొందరి వాదన. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొందరూ యువకులకు ప్రశ్న పత్రాలను సమకూర్చుతానంటూ రేణుక రూ.14 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ప్రవీణ్ అమ్మాయిల బలహీనత ఉన్నట్టు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్ లో 50 మందికి పైగా యువతుల ఫోన్ నెంబర్లున్నాయి.వీరిలో కొంతమంది అతనితో ఛాటింగ్ చేసినట్టు వెల్లడి అయింది. 

TSPSC Website: హనీట్రాప్‌! | TSPSC website hacking

లీకేజీ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను రాబట్టడంలో వారి వాంగ్మూలంగా చాలా కీలకం కానుంది. ముగ్గురు యువతులకు దర్యాప్తు బృందం ఫోన్ చేయగా.. కేసులోకి తమను లాగొద్దని.. తమ పరువు పోతుందని వారు ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలో మిగిలిన వారిని విచారించాలా.. సాక్షులుగా చేర్చాలా అని దర్యాప్తు అధికారులు ఆలోచిస్తున్నారు. ఇక ప్రవీణ్ బలహీనతను అవకాశంగా తీసుకొని రేణుక ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారం నడిపినట్టు టాక్. చివరికీ బేరసారాలు బెడిసికొట్టడంతో ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. డబ్బుల కోసం రేణుక.. అమ్మాయిల మోజులో ప్రవీణ్, థ్రిల్లింగ్ కోసం రాజశేఖర్ ప్రశ్న పత్రాలను లీక్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారానికి రేణుకనే వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. ముందు ముందు ఇంకేమి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూద్దాం. 

Also Read :  ఈ ఫోటోలో ఉన్న తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..? అతనికి భార్య, కూతురు కూడా ఉన్నారు..!

 

Visitors Are Also Reading